బరువు తగ్గించే.. పూల్‌ మఖనా!

పూల్‌ మఖనాను ఆహారంలో భాగం చేసుకోండి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి, ఆరోగ్యంగా ఉంచుతుంది.

Published : 13 Sep 2023 02:55 IST

పూల్‌ మఖనాను ఆహారంలో భాగం చేసుకోండి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి, ఆరోగ్యంగా ఉంచుతుంది.

  • తరచూ ఆకలి వేస్తోంటే.. కొన్ని వేయించిన తామర విత్తనాల(మఖనా)ను తింటే సరి. దీనిలో కెలొరీలు తక్కువ, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. చాలాసేపటి వరకు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. బరువు తగ్గించడంలో సాయపడుతుంది.
  • రసాయన ఉత్పత్తులు, హార్మోన్ల మార్పు, అసమతుల్య ఆహారం.. ఇలా కురులు రాలడానికి కారణాలు బోలెడు. పూల్‌ మఖనాను రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. వీటిల్లోని ప్రొటీన్‌, కెరోటిన్‌లు కుదుళ్లకు దృఢత్వాన్ని అందిస్తాయి. ఐరన్‌, థయామిన్‌ జుట్టు రాలడాన్ని, చుండ్రును నివారించడంలోనూ తోడ్పడతాయి.
  • ముప్పై రాకముందే ముడతలు, గీతలు పలకరిస్తుంటే మఖనాలను తరచూ తినండి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను త్వరగా దరిచేరనీయవు.
  • గర్భవతులకు మంచి పోషకాహారం. రక్తపోటును అదుపులో ఉంచడమే కాదు.. జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్