ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా...

మొదటిసారి తల్లైన వారు బిడ్డకు పాలిచ్చేటప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా శుభ్రతకు సంబంధించిన అవగాహన పెంచుకుంటే పిల్లలకు అనారోగ్యాలు రాకుండా నివారించవచ్చు.

Published : 13 Sep 2023 02:55 IST

మొదటిసారి తల్లైన వారు బిడ్డకు పాలిచ్చేటప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా శుభ్రతకు సంబంధించిన అవగాహన పెంచుకుంటే పిల్లలకు అనారోగ్యాలు రాకుండా నివారించవచ్చు..

  • చనుమొనలపై పరిమళద్రవ్యాలు, సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించరాదు. వీటిలో ఉండే రసాయనాలు చిన్నారికి శ్వాసకోస సమస్యలు,   అలర్జీలు కలిగిస్తాయి. ఒక్కోసారి ఆ వాసనలకి వాంతులు చేసుకునే అవకాశం కూడా ఉంది. అందుకే బిడ్డకి పాలిచ్చే ముందు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం మార్కెట్‌లో ప్రత్యేకంగా బ్రెస్ట్‌ వైప్స్‌ వస్తున్నాయి. పరిమళాలు, ఆల్కహాల్‌్ లేని వాటిని, మీ శరీరానికి సరిపడే వాటిని ఎంచుకోవాలి. డాక్టరుని సంప్రదించి తీసుకున్నా మంచిదే.
  • బిడ్డ పాలు తాగిన తర్వాత పాలు మిగిలిపోతుంటే.. వాటిని బ్రెస్ట్‌ పంపుల ద్వారా సేకరించి ఫ్రీజర్‌లో భద్రపరుచుకోవచ్చు. ఈ బ్రెస్ట్‌పంప్స్‌ ఎలక్ట్రిక్‌వీ అందుబాటులోఉన్నాయి. శిశువుకి పాలు తక్కువైన సమయంలో వీటిని వాడుకోవచ్చు. అయితే ఈ బ్రెస్ట్‌పంప్స్‌ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే వాటిల్లో బ్యాక్టీరియా వృద్ధిచెంది చిన్నారికి హాని కలిగిస్తాయి.
  • శిశువుకి పాలిచ్చేముందు చేతులను శుభ్రం చేసుకోవాలి. కంటికి కనిపించని సూక్ష్మక్రిములు పిల్లలకు ఇన్‌ఫెక్షన్లు రావడానికి కారణం అవుతాయి.
  • పిల్లలకి పాలు ఇవ్వడంలో ఇబ్బంది లేని లోదుస్తులను ఎంపిక చేసుకోవాలి. వారు తాగేప్పుడు ఇబ్బంది లేకుండా ఉండే అడ్జస్టబుల్‌వి, మీ శ్వాసకి ఇబ్బంది కలిగించనవీ ఎంచుకోవాలి. ఇవి బయట బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి.
  • పిల్లలు తాగేటప్పుడు కారిన పాలు..  నైటీలు, బ్లవుజులపై పడి ఎండిపోతుంటాయి. ఆ దుస్తుల్ని ఉతక్కుండా అలానే వేసుకుంటే చిన్నారి సున్నితమైన చర్మం అలర్జీలకు గురవుతుంది. శుభ్రమైన దుస్తుల్ని ధరించడం తప్పనిసరి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్