వ్యాక్సింగ్‌ తర్వాత చర్మసంరక్షణ

చర్మంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకుని మెరిసి పోవాలనుకుంటున్నారా? అయితే వ్యాక్సింగ్‌ తర్వాత కొన్ని నియమాలను పాటిస్తే చర్మ సంబంధిత సమస్యలు, దద్దుర్లు, దురదలు రాకుండా జాగ్రత్త పడొచ్చు అంటున్నారు నిపుణులు.

Published : 13 Sep 2023 02:55 IST

చర్మంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకుని మెరిసి పోవాలనుకుంటున్నారా? అయితే వ్యాక్సింగ్‌ తర్వాత కొన్ని నియమాలను పాటిస్తే చర్మ సంబంధిత సమస్యలు, దద్దుర్లు, దురదలు రాకుండా జాగ్రత్త పడొచ్చు అంటున్నారు నిపుణులు.

  • వ్యాక్సింగ్‌ తర్వాత వేణ్నీళ్లతో స్నానం, స్విమ్మింగ్‌ వంటివి 24 గంటల వరకూ చేయకూడదు. వేడినీళ్లు ఫాలికల్స్‌పై ప్రభావం చూపి చర్మ సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. ఈతకొట్టే  నీళ్లలో ఉండే క్లోరిన్‌ చర్మం లోతుల్లోకి చొచ్చుకుపోయి దద్దుర్లు, దురదలు వంటివి కలుగజేసే ప్రమాదమూ ఉంది.  
  • సువాసన భరితమైన, రసాయనాలతో నిండిన సబ్బులు, సెంట్లను ఉపయోగించడకూడదు. వాటి రసాయనాలు చర్మరంధ్రాల్లోకి చేరి ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయి. బదులుగా గాఢత తక్కువ ఉండే, సహజ పరిమళాలతో చేసిన సౌందర్య ఉత్పత్తులను వాడటం మేలు.
  • వ్యాక్సింగ్‌ అయ్యాక చర్మం పొడిబారకుండా, ఎర్రబారకుండా మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా రాయాలి. సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు ఉన్న నూనెలు వాడితే దద్దుర్ల నుంచి తక్షణ ఉపశమనం దొరుకుతుంది.
  • వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. దీనివల్ల ఒంటికి గాలి తగులుతుంది. మెత్తగా ఉండే వస్త్రాల్ని వేసుకోవడం వల్ల చర్మానికి రాపిడి ఉండదు.
  • కలబంద గుజ్జు, టీట్రీ ఆయిల్‌ను చర్మానికి రాస్తే మంట, వాపు రావడం లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. వ్యాక్సింగ్‌ అయ్యాక రోజులో ఒకసారి చామంతి టీని తాగితే మంచిది. దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వ్యాక్సింగ్‌ దుష్ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్