విటమిన్‌ సి లోపాన్ని గుర్తించండిలా...

మనం రోజు తీసుకునే ఆహారంలో తక్కిన పోషకాలతో పాటు విటమిన్‌ సి చాలా అవసరం. ఇది చర్మం, రక్తనాళాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

Updated : 14 Sep 2023 02:04 IST

మనం రోజు తీసుకునే ఆహారంలో తక్కిన పోషకాలతో పాటు విటమిన్‌ సి చాలా అవసరం. ఇది చర్మం, రక్తనాళాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. కానీ తీసుకునే భోజనంలో విటమిన్‌ సి లోపించడం వల్ల కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి. వాటి సంకేతాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం...

  • శరీరం అలసట, పాలిపోయిన చర్మం, శ్వాస ఆడకపోవటం, ఐరన్‌ లోపం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు విటమిన్‌ సి లోపం కారణంగా జరుగుతుంటాయి.
  • కండరాలు బలహీనంగా, శారీరక బలం తగ్గటం శరీరంలో విటమిన్‌ సి లోపం ఉండటానికి సూచన. దంత సమస్యలు, చిగుళ్ల వాపు, రక్తస్రావం వంటివి కూడా కొన్ని సార్లు కనిపిస్తుంటాయి. దానికీ¨ ఇదే కారణం.
  • శరీరంలో కావాల్సిన విటమిన్‌ సి లేకపోతే గాయాలు నయం కావడానికి చాలా సమయం పడుతుంది. చర్మం పొడిబారటం, గరుకుగా మారటం, జుట్టు చివర్లు చిట్లిపోవడం, గోళ్లు పెరగకపోవటం వంటివి జరుగుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్