పండగ అయిపోయింది... పంపించేద్దాం!

దీపావళి పండక్కి ఇంటిల్లిపాదీ ఒక చోట చేరి...కబుర్లు చెప్పుకొంటూ పిండివంటలు తింటుంటే ఎంత బాగుందో కదా! కానీ, వీటి నుంచి పెద్ద ఎత్తున కెలొరీలూ.. టపాకాయల పొగతో ట్యాక్సిన్లు ఒంట్లో చేరుంటాయి.

Published : 14 Nov 2023 01:48 IST

దీపావళి పండక్కి ఇంటిల్లిపాదీ ఒక చోట చేరి...కబుర్లు చెప్పుకొంటూ పిండివంటలు తింటుంటే ఎంత బాగుందో కదా! కానీ, వీటి నుంచి పెద్ద ఎత్తున కెలొరీలూ.. టపాకాయల పొగతో ట్యాక్సిన్లు ఒంట్లో చేరుంటాయి. వీటిని బయటకి పంపించేందుకు డిటాక్స్‌ చేయాల్సిందే. అదెలాగంటారా?

  • కప్పు గోరువెచ్చని నీళ్లల్లో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే ఒంట్లోని ట్యాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణప్రక్రియా సాఫీగా సాగుతుంది.
  • కప్పు చొప్పున యాపిల్‌, క్యారెట్‌ ముక్కల్ని తీసుకుని దానికి ఓ చిన్న బీట్‌రూట్‌ ముక్కను కలిపి జ్యూస్‌ చేయండి. ఆపై దీన్ని వడకట్టి పావు చెక్క నిమ్మరసం కలిపి తీసుకుంటే సరి... ఒంట్లోని హానికారక రసాయనాలూ, వ్యర్థాలు బయటకిపోతాయి.
  • పండగప్పుడు చేసే పదార్థాల్లో నూనె, నెయ్యి వాడకం కాస్త ఎక్కువ. కాబట్టి తర్వాత రెండు రోజులూ రాత్రి పూట తేలికైన ఆహారం తీసుకోండి. ముఖ్యంగా బీన్స్‌, చిలగడదుంప, క్యారెట్‌, పాలకూరతో సూప్‌ తయారు చేసుకోండి. దీనికి కాస్త జీలకర్ర, దాల్చినచెక్క, మిరియాల పొడిని చల్లుకుని తాగితే సరి. ఇందులో కెలొరీలు తక్కువగా ఉండటమే కాదు... శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఫైబర్‌, ఫైటో న్యూట్రియంట్లు తగినంతగా అందుతాయి. ఫలితంగా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. తిరిగి శక్తినీ పుంజుకోవచ్చు.
  • పెరుగులో ఓట్స్‌ నానబెట్టి వరుసగా మూడు, నాలుగు రోజులు తినండి. వీటిల్లోని ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్లు సహజ డిటాక్స్‌లా పనిచేస్తాయి. పోషకాలు అందించి చురుగ్గా ఉంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్