చిన్న బొజ్జలో ఇబ్బందా?

చంటిపిల్లల్లో తరచూ ఎదురయ్యే సమస్య మలబద్ధకం. పిల్లలు చురుగ్గా ఉంటే మనకే బాధా ఉండదు.. కానీ ఇలాంటి సమస్యలు ఎదురవ్వగానే కంగారు పడి డాక్టర్‌ దగ్గరికి పరుగుపెడతాం.

Published : 23 Nov 2023 01:42 IST

చంటిపిల్లల్లో తరచూ ఎదురయ్యే సమస్య మలబద్ధకం. పిల్లలు చురుగ్గా ఉంటే మనకే బాధా ఉండదు.. కానీ ఇలాంటి సమస్యలు ఎదురవ్వగానే కంగారు పడి డాక్టర్‌ దగ్గరికి పరుగుపెడతాం. అలా చేయడం మంచిదే అయినా, ఈ చిట్కాలు పాటించి చూడండి.. ఫలితం ఉంటుంది..

  • వర్కౌట్లు చేయించాలి. ఇదేంటి అంత చిన్నపిల్లలకి వ్యాయామాలేంటి అనుకుంటున్నారా? ఇది తేలిక పాటి వ్యాయామం. బుజ్జాయిని వెల్లకిలా పడుకోబెట్టి, కాళ్లను సైకిల్‌ తొక్కిన మాదిరిగా చేయాలి. అలా కాసేపు చేస్తే పేగుల్లో కదలిక జరిగి మలబద్ధకం తొలగిపోతుంది.
  • వేడినీటితో స్నానం చేయించాలి. దీని వల్ల వారి శరీరానికి చక్కని ఉపశమనం లభిస్తుంది. శరీర భాగాలన్నీ చురుగ్గా మారతాయి. బుజ్జాయి పొట్ట ఖాళీ అవుతుంది.
  • బుజ్జిపొట్టపై కొబ్బరినూనె రాసి చేత్తో సున్నితంగా వృత్తాకారంలో మసాజ్‌ చేయండి. దీనివల్ల పేగు కదలికలు మెరుగవుతాయి.
  • సమయానికి పాలు పట్టాలి. అలాగే ఏడాది దాటిన చిన్నారులకి సమయానుగుణంగా కొద్దిగా మంచి నీటిని కూడా తాగించాలి. ఘనాహారం పెడుతుంటే.. మెత్తగా ఉడికించిన బార్లీ, గోధుమ, ఓట్స్‌ వంటి పీచు ఉండే ఆహారపదార్థాలను పెట్టాలి. ఇవి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్