కడుపుబ్బరాన్ని తగ్గించే అల్లం!

అదుపుతప్పిన ఆహారపుటలవాట్లు అనేక అనారోగ్యాలను తెచ్చిపెడు తున్నాయి. వాటిల్లో అజీర్తి, గ్యాస్‌ కూడా ఒకటి. వీటిని నుంచి తక్షణ ఉపశమనం అందిస్తాయీ ఆహారాలు.

Published : 24 Nov 2023 01:31 IST

అదుపుతప్పిన ఆహారపుటలవాట్లు అనేక అనారోగ్యాలను తెచ్చిపెడు తున్నాయి. వాటిల్లో అజీర్తి, గ్యాస్‌ కూడా ఒకటి. వీటిని నుంచి తక్షణ ఉపశమనం అందిస్తాయీ ఆహారాలు.

బొప్పాయి: దీనిలోని పపైన్‌ అనే ఎంజైము జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. బొప్పాయిలోని పీచూ, నీరు... వ్యర్థాలను బయటకు పంపి, వికారాన్ని దూరం చేస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

అల్లం: వికారం, అజీర్తి, గ్యాస్‌ వంటివాటితో ఇబ్బంది పడుతుంటే... కాస్త అల్లం టీ తాగి చూడండి. లేదంటే ఎండబెట్టిన అల్లం చూర్ణానికి చిటికెడు పంచదార కలిపి నోట్లో వేసుకోండి. ఉపశమనం ఉంటుంది. అలాగే సన్నగా తరిగిన అల్లంలో కాస్త ఉప్పు చేర్చి అన్నంలో కలిపి తిన్నా మంచిదే. వాత, కఫదోషాలని తగ్గిస్తుంది.

కొబ్బరి నీళ్లు: సహజ చక్కెర్లు, విటమిన్‌ సి, ఎలక్ట్రోలైట్లు అందించే కొబ్బరినీళ్లు.. అజీర్తినీ, వికారాన్ని తగ్గిస్తాయి. తక్షణ శక్తిని అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

అరటిపండు: కడుపుబ్బరంగా అనిపించినప్పుడు పొటాషియం మోతాదు ఎక్కువ ఉండే అరటి పండ్లను తినండి. బరువైన ఆహారం తీసుకున్న తర్వాత అసౌకర్యంగా ఉన్నా, శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడూ, అతిగా ఆందోళన పడినప్పుడూ ఈ పండుని తింటే మంచిది. 

హెర్బల్‌ టీ: గ్రీన్‌ టీ, ఇతర హెర్బల్‌ టీలు ఏం తీసుకున్నా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో ఉబ్బరం తగ్గుతుంది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లని దూరం చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్