బచ్చలి కూర.. భుజంగాసనం..

చలికాలం వచ్చిందంటే.. దగ్గు, జలుబు, తుమ్ములు మొదలవుతాయి. వీటికి తోడు శ్వాస సంబంధిత వ్యాధులుంటే.. ఊపిరాడకపోవడం, ముక్కుపట్టేయడం వంటివి తలెత్తుతాయి.

Updated : 25 Nov 2023 02:53 IST

చలికాలం వచ్చిందంటే.. దగ్గు, జలుబు, తుమ్ములు మొదలవుతాయి. వీటికి తోడు శ్వాస సంబంధిత వ్యాధులుంటే.. ఊపిరాడకపోవడం, ముక్కుపట్టేయడం వంటివి తలెత్తుతాయి. అలాంటి వారికి భుజంగాసనం చక్కగా పనిచేస్తుంది...

ఈ ఆసనం పాముని పోలి ఉంటుంది. అందుకే దీన్ని భుజంగాసనం అంటారు. బోర్లా పడుకొని రెండు కాళ్లు దగ్గరగా ఉంచి నేలమీద ఆనించాలి. రెండు మడమలని దగ్గరగా.. కాలివేళ్లు కూడా వీలైనంత వెనక్కి చాపి ఉంచాలి. రెండు చేతులనూ ఛాతీకి దగ్గరగా ఇరుపక్కలా నేలమీద ఆనించాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకొంటూ తలనుపైకి ఎత్తి నడుమును వీలైనంత వరకు ఫొటోలో చూపిన మాదిరిగా వెనక్కి వంచాలి. ఇలా పదిహేను సెకన్లపాటు ఉండి.. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. తర్వాత మెల్లగా తలను నేలపై ఆనించాలి. నెమ్మదిగా విశ్రాంత స్థితిలోకి రావాలి. ఇలా రోజూ క్రమం తప్పకుండా 20నుంచి 30 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

ప్రయోజనాలు..

ఆస్తమా, న్యుమోనియా, బ్రాంకైటిస్‌, మెడ, వీపు సంబంధిత నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అండాశయం పనితీరు బాగుంటుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు తగ్గుతాయి. పొట్ట, వీపు కండరాలు దృఢంగా మారతాయి. ఈ యోగాసనంతోపాటు ఆపిల్‌, టొమాటో, గుమ్మడి, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా బచ్చలికూర భలే మేలు చేస్తుంది. శీతల పానీయాలు, చలువ చేసే పదార్థాలకు
దూరంగా ఉండాలి.


ఎవరు చేయకూడదంటే..

ఈమధ్యే ఉదర సంబంధిత సర్జరీ అయితే ఈ ఆసనం వేయొద్దు. అల్సర్‌, హెర్నియా, స్పాండిలైటిస్‌ వంటి సమస్యలున్నవారు కూడా వైద్యుల సూచనల మేరకు వేయాలి.         -

శిరీష, యోగా గురు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్