వయసును దాచే పండ్లివి..

అందంగా కనిపించడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తామో కదూ! ఇన్నీ చేసి నిరాశపడేవారూ ఎక్కువే. అంటే.. పైపూతలు చాలట్లేదనేగా? అందుకే.. లోపలి నుంచీ పోషణ అందించాలి.

Published : 27 Nov 2023 01:28 IST

అందంగా కనిపించడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తామో కదూ! ఇన్నీ చేసి నిరాశపడేవారూ ఎక్కువే. అంటే.. పైపూతలు చాలట్లేదనేగా? అందుకే.. లోపలి నుంచీ పోషణ అందించాలి. ఆ సాయం చేసే పండ్లే ఇవి!

బ్లూబెర్రీస్‌.. తాజా పండ్లు దొరకడం కాస్త కష్టమే అనిపిస్తే ఎండువి తిన్నా మంచిదే. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంథోసైనిన్‌లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. వృద్ధాప్య ఛాయలనూ దరిచేరనీయవు. రోజూ కొన్ని తప్పక తీసుకుంటే సరి.

దానిమ్మ.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడతాయి. విటమిన్‌ సి చర్మంలో కొత్తకణాల వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. జ్యూస్‌, సలాడ్‌ ఏ రూపంలో తీసుకున్నా అందానికి మేలు చేస్తాయి.

బొప్పాయి.. చర్మం నిర్జీవంగా, కళ తప్పిందా? అయితే బొప్పాయిని తరచూ తీసుకోండి. దీనిలోని ఎ, సి, ఇ విటమిన్లు ఖనిజాలు చర్మానికి పునరుత్తేజాన్ని తీసుకొస్తాయి. బొప్పాయిలో ఉండే పపైన్‌ అనే ఎంజైమ్‌ సహజ మెరుపునిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్