వ్యాయామం ఎక్కువగా వద్దు..

అధిక బరువుని తగ్గించుకుని, నాజూగ్గా కనిపించాలని చాలామంది అమ్మాయిలు అనుకుంటారు. అయితే, కొందరు మాత్రం ఇందుకోసం వారంలో చేయాల్సిన వ్యాయామాలు ఒక్కరోజే చేసేయాలని ప్రయత్నిస్తుంటారు.

Published : 28 Nov 2023 02:16 IST

అధిక బరువుని తగ్గించుకుని, నాజూగ్గా కనిపించాలని చాలామంది అమ్మాయిలు అనుకుంటారు. అయితే, కొందరు మాత్రం ఇందుకోసం వారంలో చేయాల్సిన వ్యాయామాలు ఒక్కరోజే చేసేయాలని ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా ప్రమాదమే ఎక్కువంటారు వ్యాయామ నిపుణులు.

  • వ్యాయామం... మితిమీరి చేస్తే శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీని కారణంగా నిద్రలేమి ఏర్పడుతుంది. ఇది మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఈ తీరు దీర్ఘకాలం కొనసాగితే డిప్రెషన్‌లోకి జారుకునే ప్రమాదమూ పొంచి ఉంది.
  • వారంలో సన్నగా మారిపోవాలని జిమ్‌కి వెళ్లి అదే పనిగా వ్యాయామం చేసేస్తుంటారు కొందరు. దీనివల్ల నెలసరి క్రమం తప్పొచ్చు. ఇది ఈస్ట్రోజన్‌ స్థాయిల్లో తగ్గుదల వల్ల ఏర్పడుతుంది. ఆస్టియోపోరోసిస్‌ సమస్యకూ దారితీస్తుంది. 
  • అధిక వ్యాయామం రక్తపోటును పెంచుతుంది. కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల త్వరగా అలసటకు గురవుతారు. కొన్నిసార్లు గుండెపోటు వచ్చే ముప్పు కూడా ఎక్కువేనంటున్నాయి అధ్యయనాలు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్