వాళ్లు చెప్పారని తినొద్దు!

బరువు తగ్గించుకోవడానికి మనకు తెలిసిన, స్నేహితులు చెప్పిన డైట్‌ పద్ధతులన్నీ అనుసరిస్తుంటాం. మీరూ అలాంటి ప్రయత్నాలు చేస్తుంటే.. ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడండి..

Published : 29 Nov 2023 01:35 IST
బరువు తగ్గించుకోవడానికి మనకు తెలిసిన, స్నేహితులు చెప్పిన డైట్‌ పద్ధతులన్నీ అనుసరిస్తుంటాం. మీరూ అలాంటి ప్రయత్నాలు చేస్తుంటే.. ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడండి..
  • బరువు త్వరగా తగ్గాలని ఉదయంపూట అల్పాహారం మానేస్తుంటారు. మనం చేసే అతి పెద్ద తప్పు ఇదే. ఇలా చేయటం వల్ల తలతిరగడం, లోబీపీ వంటివి తలెత్తే ప్రమాదం ఉంది. పైగా జీవక్రియలు మందగించి బరువు తగ్గే మాట అటుంచి పెరిగే అవకాశం ఉంది. 
  • సెలబ్రిటీలు చెప్పారని... యూట్యూబ్‌లో చూసి కొందరు అందుబాటులో లేని ఆహారం తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఉదాహరణకు అవకాడో, కివీ వంటివి. బదులుగా స్థానికంగా దొరికే పండ్లు, కూరగాయలకే ప్రాధాన్యం ఇవ్వండి. ధర తక్కువ. ఆరోగ్యం కూడా.
  • ఆరోగ్యానికి మంచిదంటే ఏదైనా తినేయొచ్చు అనుకోవద్దు. ప్యాకెట్‌ మీద ఉన్న లేబుల్‌ని చూస్తే కెలొరీలు ఎన్నున్నాయో తెలుస్తుంది. ఉదాహరణకు మార్కెట్‌లో లభించే బ్రౌన్‌ బ్రెడ్‌ ఆరోగ్యకరమైనదిగా భావిస్తాం. అయితే కొన్నిసార్లు దాని కెలొరీలు వైట్‌ బ్రెడ్‌లో కంటే ఎక్కువగా ఉంటాయి. అందుకే పోషక విలువలు, కెలొరీలు తెలియకుండా దేన్నీ తినేయకండి.
  • సన్నగా ఉండటానికి వ్యాయామం ఒక్కటే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాం. కానీ వ్యాయామానికి, సరైన పోషకాహారం కూడా తోడైనప్పుడే బరువు తగ్గడం తేలిక అవుతుంది. పెద్దగా వ్యాయామం చేయలేం అనుకుంటే ఓ అరగంట నడిచి చూడండి.
  • బరువు తగ్గడానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. సరైనా ఆహారం తీసుకున్నా.. నిద్ర సరిగా లేకపోతే ఫలితం ఉండదు. ప్రతిరోజూ కనీసం ఆరు నుంచి ఏడు గంటల నిద్ర అవసరం. రాత్రిళ్లు వీలైనంత త్వరగా నిద్రించడం వల్ల జీవక్రియ చురుగ్గా ఉండి బరువు తగ్గడం తేలికవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్