కుంగుబాటుని గుర్తించడమూ ముఖ్యమే!

చాలామంది మహిళలు...తాము కుంగుబాటు బారిన పడ్డామని గుర్తించడంలోనూ వెనుకపడుతుంటారు. అలసట, ఇతరత్రా ఆందోళనలు అన్నీ సాధారణమే అని కొట్టిపారేస్తుంటారు.

Published : 30 Nov 2023 01:51 IST

చాలామంది మహిళలు...తాము కుంగుబాటు బారిన పడ్డామని గుర్తించడంలోనూ వెనుకపడుతుంటారు. అలసట, ఇతరత్రా ఆందోళనలు అన్నీ సాధారణమే అని కొట్టిపారేస్తుంటారు. కానీ, దీన్ని నియంత్రించకపోతే మరెన్నో అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. మరి దీన్నెలా గుర్తించాలో తెలుసా?  

  • ఒక్కోసారి కంటిమీదకు కునుకురాదు. వచ్చినా కలత నిద్రే. మరోసారి ఏడెనిమిది గంటలు నిద్రపోయాక కూడా అలసటగానే అనిపిస్తుంది. ఈ అలసట మనసునే కాదు.. శరీరాన్నీ ప్రభావితం చేస్తుంది. దాంతో ఒళ్లునొప్పులూ, తలనొప్పి వంటివి సహజంగానే ఇబ్బందిపెడతాయి. వీటికి ఒత్తిడీ, కుంగుబాటే కారణం కావొచ్చట. మరి ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే చికిత్స తీసుకోవడానికి వెనుకాడొద్దు!
  • చిన్నచిన్న విషయాలు గుర్తుండవు. తెలియని దిగులు వెంటాడుతుంది. దేనిమీదా ఏకాగ్రత ఉండదు. అప్పటికప్పుడు భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు కనిపిస్తాయి. చిన్న విషయానికే ఏడవడం, తీవ్రమైన కోపం, అపరాధభావం వంటివన్నీ కలగలపి కనిపిస్తుంటాయి.
  • లైంగికవాంఛలు తగ్గడం కూడా కుంగుబాటు లక్షణమే. మెదడులోని అనేక విషయాలు అలజడి రేపడమే ఇందుకు కారణం. ఎక్కువ రోజులు భాగస్వామికి దూరంగా ఉండటానికి యత్నిస్తుంటే ఓ సారి వైద్యులను సంప్రదించడమే మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్