ఉల్లిపొట్టుతో ఆరోగ్యం...

ఇంట్లో వంటచేసేటప్పుడు కచ్చితంగా ఉల్లిపాయ వేయాల్సిందే. తర్వాత వాటి పొట్టుని పారేస్తాం. కానీ దాంతో ఇతరత్రా ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

Published : 01 Dec 2023 01:47 IST

ఇంట్లో వంటచేసేటప్పుడు కచ్చితంగా ఉల్లిపాయ వేయాల్సిందే. తర్వాత వాటి పొట్టుని పారేస్తాం. కానీ దాంతో ఇతరత్రా ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం...

  • కొన్నిసార్లు అలర్జీల కారణంగా పాదాలు దురద పెడుతుంటాయి. అలాంటప్పుడు ఉల్లి, వెల్లుల్లి పొట్టును గోరువెచ్చని నీటిలో వేసి పాదాలను ఆ నీటిలో ఉంచితే చాలు. దీనిలోని యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి.
  • చాలామందిలో నిద్రలేమి సమస్య ఉంటుంది. దాన్ని తగ్గించడానికి ఉల్లిపొట్టు ఉపయోగపడుతుంది. దీనిలోనూ పోషకాలూ, ఖనిజాలూ నిండుగా ఉంటాయి. ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో ఉల్లిపొట్టు వేసి మూడు నిమిషాలు మరగనివ్వాలి. అందులో కాస్త నిమ్మకాయరసం, తేనె జోడించి ఆరోగ్యకరమైన టీని ఆస్వాదించవచ్చు. ఇది ఇంద్రియాలను శాంతపరిచి, కమ్మని నిద్రని అందిస్తుంది.  
  • పొట్టు మరిగించిన నీళ్లు క్రిమిసంహారకంగా పనిచేస్తాయి. గొంతులో నొప్పి, మంటను తొలగిస్తాయి. శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. గొంతు ఇన్‌ఫెక్షన్లు రావు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్