బరువు పెరిగారా?

ఆహారం... జీవనశైలిలో పెద్దగా మార్పులేకపోయినా అదే పనిగా బరువు పెరుగుతుంటే ఆలోచించాల్సిందే! బహుశా ఈ సమస్యలున్నాయేమో సరిచూసుకోండి..

Published : 02 Dec 2023 01:39 IST

ఆహారం... జీవనశైలిలో పెద్దగా మార్పులేకపోయినా అదే పనిగా బరువు పెరుగుతుంటే ఆలోచించాల్సిందే! బహుశా ఈ సమస్యలున్నాయేమో సరిచూసుకోండి..

  •  పీసీఓఎస్‌: దీంతో నెలసరి సమస్యలు.. గర్భధారణలో ఇబ్బందులు, మొటిమలు, యాక్నె వంటి సమస్యలు వస్తాయని తెలిసిందే! వీటితోపాటు హార్మోనుల్లో అసమతుల్యత ఏర్పడి.. అధిక బరువుకు దారి తీయొచ్చు.
  • ఒత్తిడి: చీటికీమాటికీ అలసిపోతుంటాం. కాస్త నిద్రపోతే సర్దుకుంటుందిలెమ్మని తేలిగ్గా తీసుకుంటాం. కానీ.. కొన్నిసార్లు ఈ ఒత్తిడి తీవ్ర సమస్యలకూ దారి తీస్తుంది. ఇలాంటప్పుడు విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ ఆకలిని పెంచుతుంది. తీపి, అధిక కొవ్వులుండే ఆహారం తినేలా ప్రేరేపిస్తుంది. నిద్రలేమి, జీర్ణప్రక్రియ మందగించడం వంటివన్నీ అధిక బరువుకు కారణమవుతాయి. అలసిన శరీరం తనంతట తానుగా మరమ్మతు చేసుకోవడానికి నిద్ర ఎంతగానో ఉపకరిస్తుంది. తరచూ నిద్రకు  తగినంత సమయం కేటాయించక పోవడం కూడా బరువుని పెంచేస్తాయి.
  • హైపో థైరాయిడిజం: థైరాయిడ్‌ గ్రంథి తగినంత హార్మోన్లను విడుదల చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. మెనోపాజ్‌ దశకు చేరినా బరువు పెరిగే అవకాశం ఉంది. ఈస్ట్రోజన్‌ స్థాయులు తగ్గడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటివి ఇందుకు కారణాలు. బరువు పెరగగానే కడుపు కట్టేసుకోవడంపైనే దృష్టిపెట్టొద్దు. తగిన కారణాన్ని కనుక్కుని ఆపైన తగ్గే మార్గంపై దృష్టిపెట్టాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్