వ్యాయామం తర్వాత ఆకలా..

బరువు తగ్గాలని లేదా అదుపులో ఉంచుదామని వ్యాయామం చేస్తుంటాం. ఒక్కోసారి బరువు తగ్గకపోగా మరింత పెరుగుతుంటాం. ఆశ్చర్యంగా ఉంది కదా! వ్యాయామం తర్వాత ఆకలితో ఎడాపెడా తినేయడమే ఇందుకు కారణం. అలా కాకూడదంటే నిపుణులిచ్చే సలహాలివే.

Updated : 03 Dec 2023 04:20 IST

బరువు తగ్గాలని లేదా అదుపులో ఉంచుదామని వ్యాయామం చేస్తుంటాం. ఒక్కోసారి బరువు తగ్గకపోగా మరింత పెరుగుతుంటాం. ఆశ్చర్యంగా ఉంది కదా! వ్యాయామం తర్వాత ఆకలితో ఎడాపెడా తినేయడమే ఇందుకు కారణం. అలా కాకూడదంటే నిపుణులిచ్చే సలహాలివే..

నీళ్లు తాగి: ఎక్కువ సేపు వ్యాయామం చేసిన తర్వాత కెలొరీలు కరిగి ఆకలి వేసిన భావన కలుగుతుంది. అందుకే వ్యాయామం పూర్తయ్యాక తినడానికి ముందు కొద్దిగా నీళ్లు తాగండి. అలా చేయటం వల్ల ఆహారాన్ని ఎక్కువ తీసుకోలేం. మన బరువు అదుపులో ఉంటుంది.

సమతులాహారంతో: వ్యాయామం చేస్తున్నాం కాబట్టి ఏమైనా తినేయొచ్చు అనుకోవద్దు. వర్కవుట్స్‌ తర్వాత తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, మంచి కొవ్వులు ఉండాలి. పాలు, గుడ్లు, పనీర్‌ వంటివి తినాలి. సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు... అంటే నిదానంగా జీర్ణమయ్యే తృణధాన్యాలు, దుంపలు వంటివి తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌ వంటివీ మేలు చేస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలను అందజేస్తాయి.

నిదానంగా తింటే: టైం లేదనో మరేదైనా పనుందనో గాబరాపడుతూ ఆహారం తినేస్తుంటాం. అలా చేయటం వల్ల తినే ఆహారంపై శ్రద్ధ పెట్టలేం. మనకే తెలీకుండా ఎక్కువగా తినేస్తూనే ఉంటాం. బరువూ తగ్గం. అందుకే  ఆహారాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ నమిలి తినాలి. ఇలా చేయటం వల్ల కొంచెం తిన్నా.. పొట్ట నిండిన భావన కలుగుతుంది. వ్యాయామం తర్వాత నట్స్‌, ప్రొటీన్‌లతో నిండిన స్మూతీ వంటివి తీసుకోవచ్చు. శుద్ధి చేసి ప్యాకెట్లలో నింపిన ఆహారాన్ని మాత్రం తినకూడదు.

ఒత్తిడి వద్దు: నిద్రలేమి, ఒత్తిడితో ఉన్నప్పుడు ఆకలిని మనం నియంత్రించలేం. ఎందుకంటే వీటివల్ల హార్మోనుల అసమతుల్యత ఏర్పడి తినాలనే కోరిక పెరుగుతుంది. ముఖ్యంగా తీపి పదార్థాలపై మనసు మళ్లుతుంది. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ఆకలీ అదుపులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్