ఒత్తిడి తగ్గించే వ్యాయామాలు...

చాలామంది మహిళలకు ఇల్లు, ఆఫీసు... పనుల్ని సమన్వయం చేసుకోవడంతోనే సమయం గడిచిపోతుంది. ఈ క్రమంలోనే ఒత్తిడికి గరవుతుంటారు. దీన్ని అధిగమించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఈ వ్యాయామాలతో దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.. వీటివల్ల శరీరం మొత్తానికి వ్యాయామం కలుగుతుంది.

Published : 04 Dec 2023 01:14 IST

చాలామంది మహిళలకు ఇల్లు, ఆఫీసు... పనుల్ని సమన్వయం చేసుకోవడంతోనే సమయం గడిచిపోతుంది. ఈ క్రమంలోనే ఒత్తిడికి గరవుతుంటారు. దీన్ని అధిగమించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఈ వ్యాయామాలతో దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు..

పరుగు-నడక: వీటివల్ల శరీరం మొత్తానికి వ్యాయామం కలుగుతుంది. అయితే, శ్వాస ప్రక్రియపై దృష్టిపెడుతూ వేగంగా నడవాలి. అప్పుడే ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్‌ హార్మోను శరీరంలో విడుదలవుతుంది. మానసిక ఆందోళన దూరమవుతుంది.

వెయిట్‌ లిఫ్టింగ్‌... డిప్రెషన్‌ నుంచి బయటపడేయటంలో ఇది సాయపడుతుంది. మన చేతిలో బరువైన వస్తువు ఉండటం వల్ల మన ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. మరేమీ ఆలోచించనివ్వదు. ఫలితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది.

యోగా... దీన్ని మన జీవనశైలిలో భాగం చేసుకోవడం వల్ల శరీరం సౌకర్యవంతంగా మారుతుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. రోజూ కనీసం గంట పాటు యోగా చేయడం వల్ల ఆలోచనాశక్తి పెరుగుతుంది. శ్వాసక్రియ మెరుగుపడి ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.

తాయ్‌ చి.... ఇది కూడా మన యోగాలానే ఉంటుంది. కేవలం చేతులను కదిలిస్తూ చేసే కసరత్తు ఇది. భావోద్వేగాలను నియంత్రిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్