గులాబీతో బరువు తగ్గేద్దాం...

అందానికీ.. అలంకరణకీ గులాబీని వినియోగించడం తెలిసిందే. దీంతో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో తెలియాలంటే.. చదివేయండి.

Published : 05 Dec 2023 01:19 IST

అందానికీ.. అలంకరణకీ గులాబీని వినియోగించడం తెలిసిందే. దీంతో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో తెలియాలంటే.. చదివేయండి.

  • ఎండిన గులాబీ రేకలతో టీ ప్రయత్నించండి. ఇది శరీరం నుంచి హానికరమైన టాక్సిన్లను తొలగించడంలో సాయపడుతుంది. మెటబాలిజాన్ని వృద్ధి చేసి, అదనపు కొవ్వును తొలగిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సాయపడుతుంది.
  • నెలసరి సమయంలో భావోద్వేగాల్లో మార్పులను సహజంగానే గమనిస్తుంటాం. కోపం, విసుగు లాంటివి కనిపిస్తోంటే రోజ్‌ టీ ప్రయత్నించండి. మెదడును శాంతపరచడమే కాదు.. ప్రశాంతమైన నిద్రనూ అందిస్తుంది.
  • నెలసరి సమయంలో మనలో చాలామందిని విపరీతమైన నొప్పి వేధిస్తుంది. అలాంటప్పుడు వేడి నీటిలో గులాబీ రేకలను వేసుకొని తాగండి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతోపాటు నొప్పి నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలుంటాయి. ఇవి రుతు సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. హార్మోనుల అసమతుల్యతకూ మంచి మందు.
  • విటమిన్‌ సి రోగనిరోధకతను పెంచి.. శరీరాన్ని వివిధ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దీనిలోని పీచుపదార్థం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా జరిగేలా చూస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్