వ్యాయామం తర్వాత నొప్పులా?

ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి.. ఎలాగైనా వ్యాయామం మొదలుపెట్టాలని గట్టిగా అనుకుంటాం. కానీ కొద్దిరోజులకే ఎక్సర్‌సైజ్‌ల తర్వాత ఒళ్లు నొప్పులు.. ఇంట్లో పనులు చేసే ఓపిక ఉండట్లేదని పక్కన పెట్టేశామన్న సమాధానం వస్తుంటుంది.

Updated : 07 Dec 2023 05:32 IST

ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి.. ఎలాగైనా వ్యాయామం మొదలుపెట్టాలని గట్టిగా అనుకుంటాం. కానీ కొద్దిరోజులకే ఎక్సర్‌సైజ్‌ల తర్వాత ఒళ్లు నొప్పులు.. ఇంట్లో పనులు చేసే ఓపిక ఉండట్లేదని పక్కన పెట్టేశామన్న సమాధానం వస్తుంటుంది. ఈ చిట్కాలను పాటించేయండి.. చక్కగా వ్యాయామం కొనసాగించొచ్చు.

  • పిల్లల్ని స్కూల్‌కి పంపాలి. ఇంట్లో పనులు ఎదురు చూస్తుంటాయి. వీటి చుట్టూనే మన ఆలోచనలు పరుగెడుతుంటాయి. అందుకోసమే వ్యాయామాన్నీ మొక్కుబడిగా చేసేస్తుంటాం. బరువు తగ్గాలనో, నడుము నాజూగ్గా అవ్వాలనో గబగబా నాలుగు ఎక్సర్‌సైజ్‌లు ఎంచుకున్నాం సరే! శరీరం అలవాటు పడాలిగా? లేకే ఈ నొప్పులు. అందుకే కసరత్తులు మొదలుపెట్టే ముందూ, వెనకా తేలికపాటి స్ట్రెచ్‌లు తప్పనిసరి. అప్పుడు వ్యాయామాలని ఇష్టంగా చేయగలుగుతాం.
  • విరామాలు తీసుకోవడం, మంచి నీళ్లు తాగడం వంటివి చేస్తున్నారా? కండరాలు కోలుకోవాలన్నా, శక్తి పుంజుకోవాలన్నా ఈ రెండూ ముఖ్యమని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామానికి ముందు, మధ్యమధ్యలోనూ కొద్దిగా నీళ్లు తాగాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లు అందుతాయి. లేదంటే కండరాలు పట్టేయడం వంటి సమస్యలూ వస్తాయి.
  • చెమట చిందించాక వెంటనే రోజువారీ పనుల్లో పడిపోవద్దు. నీరసం వచ్చేస్తుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, మేలు చేసే కొవ్వులు సమపాళ్లలో ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల ఆహారం కూడా ఈ నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి సాయపడుతుంది. అరటి, కర్బూజా, పాలు, నట్స్‌కి ప్రాధాన్యమివ్వండి. ఇవీ నొప్పులను దూరం చేస్తాయి.
  • వేడి నీటి స్నానం కూడా కొంతమేర సాయపడుతుంది. ఇప్పుడు మార్కెట్‌లో రోలర్స్‌ దొరుకుతున్నాయి. కండరాలు పట్టేసి నొప్పులు త్వరగా వదలనప్పుడు వీటితో మసాజ్‌ చేస్తే రక్తప్రసరణ మెరుగ్గా జరిగి, కండరాలకు విశ్రాంతి దొరుకుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్