నెయ్యితో లాభాలెన్నో...!

చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి కలిపి గోరుముద్దలు తినిపించేవారు. కానీ, ఇప్పుడు నేతి ఆహారం తినాలన్నా, నాలుగు చుక్కలు వేసుకోవాలన్నా... అమ్మో లావయిపోతాం. కొలెస్ట్రాల్‌ పెరిగిపోతుందని భయపడిపోతుంటారు.

Updated : 09 Feb 2024 04:25 IST

చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి కలిపి గోరుముద్దలు తినిపించేవారు. కానీ, ఇప్పుడు నేతి ఆహారం తినాలన్నా, నాలుగు చుక్కలు వేసుకోవాలన్నా... అమ్మో లావయిపోతాం. కొలెస్ట్రాల్‌ పెరిగిపోతుందని భయపడిపోతుంటారు. అయితే, ఈ సమస్య అతిగా తిన్నప్పుడే అంటారు పోషకాహార  నిపుణులు. మరి ఇంతకీ ఇందులో ఉన్న ప్రయోజనాలేంటో తెలుసుకుందామా!

  • రోజూ మొదటి ముద్దలో కాస్త శొంఠిపొడి, చిటికెడు నెయ్యి వేసుకుని తినండి. ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. అంతేకాదు, ఇలా తక్కువ పరిమాణంలో తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఇది చిన్నపేగు శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఒమేగా -3 ఆమ్లాలు రక్తంలో ఉండే చెడు లేదా ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గినట్లే!  
  • శరీరానికి కావాల్సిన కొన్ని మంచి కొవ్వులూ నెయ్యిలో ఉంటాయి. ఇందులో ఉండే బ్యూటెరిక్‌ ఆమ్లం వ్యాధులపై పోరాడే శక్తినిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • చాలామంది నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతామని అనుకుంటారు. కానీ కొద్దిగా దీన్ని తిన్నా... కడుపు నిండిన భావన ఉండటం వల్ల అతిగా తినే అలవాటుకి దూరంగా ఉంటారు. దీంతో ఊబకాయం దరిచేరదు. ఇక, ఇందులోని విటమిన్‌ ఇ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు... హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. అలానే విటమిన్‌ కె శరీరం కాల్షియంని గ్రహించేలా చేసి దంతాలూ, ఎముకల్నీ దృఢంగా మారుస్తుంది.
  • నెలసరి ఒక్కోసారి ఆలస్యంగా రావడం, వచ్చినప్పుడు అధిక రక్తస్రావం, ఒళ్లునొప్పులు వంటి సమస్యలతో బాధపడే మహిళలు చాలామందే. ఇలాంటివారు కొన్నాళ్లు క్రమం తప్పకుండా ఓ చెంచా నెయ్యి తింటే వీటన్నింటినీ అధిగమించేయొచ్చు. అంతేకాదు, ఇది శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. ఒత్తిడి, భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్