పొట్ట తగ్గించే టీలు..

కొందరు మహిళల్లో... పిల్లలు పుట్టాక లేదా వ్యాయామాలు చేయక పొట్ట పెరిగిపోతుంటుంది. ఆ కారణంగా ఎటువంటి దుస్తులు ధరించినా నెలల గర్భిణిలా కనిపిస్తుంటారు.

Updated : 11 Feb 2024 03:44 IST

కొందరు మహిళల్లో... పిల్లలు పుట్టాక లేదా వ్యాయామాలు చేయక పొట్ట పెరిగిపోతుంటుంది. ఆ కారణంగా ఎటువంటి దుస్తులు ధరించినా నెలల గర్భిణిలా కనిపిస్తుంటారు. పొట్ట తగ్గి నాజుగ్గా తయారవ్వడానికి ఈ టీలు..!

  • పసుపు, పుదీనా టీ... ఒకటిన్నర కప్పుల నీళ్లల్లో చిటికెడు పసుపు, కొన్ని పుదీనా ఆకులు వేసి చిన్న మంట మీద మరిగించాలి. దానిలో తీపి కోసం తేనె చేర్చుకుంటే మేలే. ఈ టీని రోజూ తాగడం వల్ల పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తాయి.
  • అల్లం టీ... అధిక బరువున్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో అల్లం కచ్చాపచ్చాగా దంచి వేయాలి. దాన్ని ఒక కప్పు వచ్చేవరకూ మరిగించాలి. నీటిని వడకట్టి అందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగితే చాలు. అల్లం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిలోని జింజెరాల్‌ అధిక కొవ్వులను వేగంగా కరిగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువుని తగ్గిస్తుంది.
  • అశ్వగంధ టీ... ఈ తేనీరు ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ  ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అదనపు కొవ్వును తగ్గిస్తాయి. నిద్రలేమిని దూరం చేస్తాయి.
  • దాల్చిన చెక్క టీ... శరీరంలో ఉండే చెడుకొవ్వులను కరిగించడానికి, జీవక్రియలను మెరుగుపరచడానికీ టీ సాయపడుతుంది. గ్లాసు వేడి నీళ్లల్లో చెంచా దాల్చిన చెక్కపొడి వేసి, కాస్త తేనె, నిమ్మరసం కలిపి రోజూ తీసుకుంటే సరి. పొట్ట చుట్టూ ఉండే అదనపు కొవ్వు కరిగి నడుము నాజూగ్గా మారుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్