వంటగదిలో సహజ ఔషధాలు...

కాలంతో సంబంధం లేకుండా దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం... వంటివి పిల్లల్లో, పెద్దల్లో కనిపిస్తుంటాయి. వీటిని తగ్గించడానికి యాంటీ బయాటిక్స్‌ను అధికంగా ఉపయోగిస్తుంటారు.

Updated : 16 Feb 2024 05:51 IST

కాలంతో సంబంధం లేకుండా దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం... వంటివి పిల్లల్లో, పెద్దల్లో కనిపిస్తుంటాయి. వీటిని తగ్గించడానికి యాంటీ బయాటిక్స్‌ను అధికంగా ఉపయోగిస్తుంటారు. వీటివల్ల కొన్ని దుష్ఫలితాలూ ఎదురవ్వొచ్చు. అలాకాకుండా వంటింట్లో ఉండే పదార్థాలతోనే వీటిని తరిమేయొచ్చని తెలుసా? అవేంటంటే...

వెల్లుల్లి... యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఒక వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వ్యాధుల నుంచి రక్షిస్తుంది. వీటిని వేయించి తింటే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అల్లం... యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సహజ యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. గొంతు నొప్పి, జలుబు వచ్చినప్పుడు అల్లం టీ తాగడం వల్ల సమస్య దూరం అవుతుంది.

తేనె... దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌ లక్షణాలు గాయాలను త్వరగా నయం చేసేందుకు సాయపడతాయి. రోజూ గోరువెచ్చని నీటిలో స్పూన్‌ తేనె కలిపి తాగితే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

పసుపు... ఇది సహజ ఔషధం. దీనిలోని కర్‌క్యుమిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ గొంతు నొప్పి, వాపుల నుంచి ఉపశమనం అందించి, అనేక రకాల ఇన్‌ఫెక్షన్‌లను దూరం చేస్తుంది. దీన్ని గోరువెచ్చని నీళ్లు, పాలల్లో కలిపి తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్