వెన్నునొప్పికి అర్ధఉష్ట్రాసన

మారుతున్న జీవనశైలి కారణంగా శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మహిళల్లో అనేక గైనిక్‌ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా పీసీఓడీ, వెన్నునొప్పి వంటి సమస్యలు వచ్చిన తర్వాత తీసుకునే చర్యల కంటే కూడా రాకుండా ముందే నివారించేందుకు అర్ధఉష్ట్రాసన ప్రయత్నించి చూడండి.

Updated : 17 Feb 2024 14:09 IST

మారుతున్న జీవనశైలి కారణంగా శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మహిళల్లో అనేక గైనిక్‌ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా పీసీఓడీ, వెన్నునొప్పి వంటి సమస్యలు వచ్చిన తర్వాత తీసుకునే చర్యల కంటే కూడా రాకుండా ముందే నివారించేందుకు అర్ధఉష్ట్రాసన ప్రయత్నించి చూడండి.

ముందుగా రెండు మోకాళ్ల మీద కూర్చుని తర్వాత నెమ్మదిగా ఫొటోలో చూపిన మాదిరిగా ఎడమకాలిని, కుడి మోకాలి పక్కగా చాపి ఉంచాలి. వెనకకు నెమ్మదిగా వాలి కుడిచేత్తో కుడికాలి మడమను పట్టుకోవాలి. ఎడమ చేతిని చిన్‌ముద్రలా.. అంటే బొటనవేలు, చూపుడువేలు కలిపి సాధ్యమైనంత వరకూ వెనకకు చాపి ఉంచాలి. ఇదే విధంగా కుడివైపునకు కూడా ప్రయత్నించాలి. ఈ ఆసనం వేసేటప్పుడు ఎలాంటి కుదుపులు లేకుండా చూసుకోవాలి. చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఈ ఆసనాన్ని 30 నుంచి 60 సెకన్లు చేయాలి. రోజుకి రెండు వైపులా మూడుసార్లు చొప్పున, మూడు నిమిషాలు సాధన చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల వెన్నెముక బలంగా ఉంటుంది. శారీరక, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఆసనంలో వెన్నెముక, కండరాలు దృఢంగా మారతాయి. స్పాండిలైటిస్‌ తగ్గుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే గర్భిణులు, హెర్నియా, వెన్నెముక సమస్యలున్న వారు గురువుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్