పాలిస్తుంటే... ఇవి తప్పనిసరి..!

నవజాత శిశువుకి తల్లిపాలే అమృతం. అంతేకాదు తల్లీబిడ్డల మధ్య బంధాన్ని మరింత బలపరిచే అంశం కూడా ఇదే. ఈ సమయంలో పోషకాహారం తీసుకుంటేనే తల్లీపిల్లలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. కొందరిలో ఈ చనుబాలు  ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో బుల్లిబొజ్జలు ఆకలితో ఉంటాయి. అలా కాకూడదంటే ఈ కింది పోషకాలను తీసుకుంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంతో ఉంటారు.

Published : 17 Feb 2024 02:11 IST

నవజాత శిశువుకి తల్లిపాలే అమృతం. అంతేకాదు తల్లీబిడ్డల మధ్య బంధాన్ని మరింత బలపరిచే అంశం కూడా ఇదే. ఈ సమయంలో పోషకాహారం తీసుకుంటేనే తల్లీపిల్లలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. కొందరిలో ఈ చనుబాలు  ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో బుల్లిబొజ్జలు ఆకలితో ఉంటాయి. అలా కాకూడదంటే ఈ కింది పోషకాలను తీసుకుంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంతో ఉంటారు.

  • పాలిచ్చే తల్లులు శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. పాలివ్వడం వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోతాయి. ఇందువల్ల మధ్యమధ్యలో మంచి నీటిని తాగుతూ ఉండాలి. ప్రతిరోజూ మూడు రకాల ఆకుకూరలు, లేదా కూరగాయలను తీసుకోవాలి. కనీసం రెండు రకాల పండ్లను తినాలి. రోజువారీ ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకుంటే చిన్నారిబొజ్జకు ఎటువంటి ఢోకా ఉండదు.
  • మెంతులు చనుబాలు పెంచడానికి దోహదపడతాయి. ఆహారంతో పాటు తీసుకున్నా లేదా నేరుగా లడ్డూ రూపంలో తీసుకున్నా చాలా శక్తిమంతంగా పనిచేస్తాయి. వీటితో పాటు ఖర్జూరాలు, అంజీరా, గింజలు తీసుకోవాలి. ఇవన్నీ పాల ఉత్పత్తికి అవసరమయ్యే హార్మోన్ల సమతుల్యతను స్థిరీకరిస్తాయి. ఫైటోఈస్ట్రోజన్‌ శాతాన్ని పెంచుతాయి. వీటిల్లోని కాల్షియంతో తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుంటుంది.
  • శాకాహారులు అయితే వెజిటబుల్‌ సూప్‌లు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఫైబర్‌, విటమిన్లు, ప్రొటీన్‌, ఖనిజాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రసవానంతరం పాపాయిలో అనారోగ్య సమస్యలుంటే గుర్తించి విటమిన్‌ బి12 ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి. బీన్స్‌, నట్స్‌, మూంగ్‌దాల్‌ వంటి వాటిని సూప్‌ చేసుకుని తీసుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్