మీకూ మైగ్రెయిన్‌ ఉందా!

చిన్నా పెద్దా తేడా లేకుండా మనలో చాలామందిని వేధించే సమస్య మైగ్రెయిన్‌. అయితే దాంతోపాటు రాత్రుళ్లు చెమటలు పట్టే ఇబ్బందితోనూ బాధపడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

Published : 18 Feb 2024 01:38 IST

చిన్నా పెద్దా తేడా లేకుండా మనలో చాలామందిని వేధించే సమస్య మైగ్రెయిన్‌. అయితే దాంతోపాటు రాత్రుళ్లు చెమటలు పట్టే ఇబ్బందితోనూ బాధపడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

మైగ్రెయిన్‌, రాత్రుళ్లు విపరీతమైన చెమటలు పట్టడం... ఈ రెండు సమస్యలు దీర్ఘకాలంగా ఉన్న మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. అంతేకాదు అమ్మాయిల్లో మైగ్రెయిన్‌ ఉంటే వారిలో మెనోపాజ్‌ లక్షణాలు త్వరగా కనిపిస్తాయని తాజా పరిశోధనల్లో తేలింది. అయితే అందరిలోనూ ఒకేలా జరగకపోయినా, మనవంతు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి పోషకాహారం తీసుకుంటూ మంచి నిద్ర, వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. నిరంతరం బీపీ, బ్లడ్‌ షుగర్‌, అధిక బరువు, కొలెస్ట్రాల్‌ స్థాయులను పరీక్షించుకోవాలి. ఇలా చేయటం వల్ల వాటి బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్