కివీతో ప్రయోజనాలెన్నో...

ఇది విదేశీ పండు అయినా ఇప్పుడు మనదగ్గరా ఎక్కువగానే పండిస్తున్నారు. ఇందులో ఉండే విటమిన్లూ, ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు నిపుణులు.

Updated : 22 Feb 2024 05:01 IST

ఇది విదేశీ పండు అయినా ఇప్పుడు మనదగ్గరా ఎక్కువగానే పండిస్తున్నారు. ఇందులో ఉండే విటమిన్లూ, ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దాం.

  • కివీలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ - బి6 పుష్కలంగా ఉన్నాయి.  వీటిని రోజూ అరటి, స్ట్రాబెర్రీ వంటి పండ్లతో కలిపి ఉదయం లేదా సాయంత్రం తినడంవల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • పండ్లు అంటేనే పిల్లలు తినడానికి ఇష్టపడరు. అందుకే వీటిని అన్ని రకాల ఫ్రూట్స్‌తో కలిపి సలాడ్స్‌గా లేదా ఐస్‌క్రీమ్‌గా మార్చి వాళ్లకి ఇవ్వండి. ఇష్టపడి తింటారు. ఇది మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
  • వయసు పైబడే కొద్దీ కొందరిలో ఎముకల పనితీరు, కంటి చూపు మందగిస్తుంది. కివీని రోజూ తీసుకోవడం వల్ల దీనిలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్‌లు ఎముకలను బలపరుస్తాయి. విటమిన్‌ - ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
  • కొంతమందిలో అలసట లేదా ఒత్తిడి కారణంగా నిద్రలేమి కనిపిస్తుంటుంది. కివీ తింటే సెరటోనిస్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరిగి ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
  • కివీలోని విటమిన్‌ - సి, యాంటీ ఆక్సిడెంట్లూ ఆస్తమా ఉన్నవారిలో శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటు స్థాయులను తగ్గించడంలో సాయపడుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్