బిడ్డ ఆయుష్షు కోసం...

కారణాలేమైనా మనలో కొందరికి గర్భధారణ సమయంలో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్‌ బిడ్డ ఆరోగ్యానికీ చేటు చేస్తాయని తెలుసా..!

Published : 24 Feb 2024 02:20 IST

కారణాలేమైనా మనలో కొందరికి గర్భధారణ సమయంలో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్‌ బిడ్డ ఆరోగ్యానికీ చేటు చేస్తాయని తెలుసా..!

గర్భంతో ఉన్నప్పుడు కొందరిలో హైపర్‌టెన్సివ్‌ డిజార్డర్‌, జెస్టేషనల్‌ డయాబెటిస్‌ వంటివి వస్తుంటాయి. అయితే ఇవి భవిష్యత్తులో బిడ్డ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ‘హైపర్‌ గ్లైసీమియా అండ్‌ అడ్వర్స్‌ ప్రెగ్నెన్సీ అవుట్‌కమ్‌’ చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మేరకు అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ అబ్‌స్ట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ కథనం ప్రచురించింది. 3వేలమందికి పైగా తల్లీబిడ్డలపై ఈ అధ్యయనం చేశారు. బిడ్డ పుట్టిన 10-14ఏళ్ల తర్వాత వాళ్ల ఆరోగ్యాన్ని పరీక్షించినప్పుడు.. వాళ్లలో సగం మందికి హృద్రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనుగొన్నారు. సాధారణంగా బిడ్డ పుట్టాక ఇలాంటి వ్యాధులు మొదలవుతాయనుకుంటాం కదా. కానీ తల్లి కడుపులో ఉన్నప్పుడే వాటికి బీజం పడుతుందంటున్నారు పరిశోధకులు. అందుకే గర్భధారణకు ముందే మన శారీరక, మానసిక ఆరోగ్యం సరిగా ఉండేలా చూసుకోవాలి. హార్మోన్లు, అధిక బరువు, లేదా ఇతర సమస్యలేవైనా ఉంటే చికిత్స తీసుకోవాలి. అవసరమైతే జీవనశైలీ మార్చుకోవాలి. అప్పుడే పండంటి బిడ్డకు జన్మనివ్వడంతోపాటు ఎటువంటి అనారోగ్యాలూ దరిచేరకుండా వారిని రక్షించుకోగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్