మానసిక ఆరోగ్యానికి... వజ్రపద్మ ముద్ర!

ప్రస్తుత జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనలు మనసునెలా కమ్మేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం కదా! దాన్నుంచి విముక్తి కావాలా... అయితే ఈ వజ్రపద్మ ముద్రను ప్రయత్నించేయండి.

Published : 24 Feb 2024 02:22 IST

ప్రస్తుత జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనలు మనసునెలా కమ్మేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం కదా! దాన్నుంచి విముక్తి కావాలా... అయితే ఈ వజ్రపద్మ ముద్రను ప్రయత్నించేయండి.

ఈ ముద్రను కూర్చొని చేయాలి. నేలమీద కష్టమనిపిస్తే కుర్చీలో కూర్చొనీ చేయవచ్చు. అయితే చేసేటప్పుడు వెన్నెముక మాత్రం నిటారుగా ఉండాలి. రెండు చేతుల బొటన వేళ్లు మినహా మిగిలిన వాటిని ఒకదానికొకటి కలిపి ఫొటోలో చూపిన మాదిరిగా ఛాతికి ఎదురుగా ఉంచాలి. ఈ క్రమంలో మీ మోచేతులు శరీరానికి తగలకుండా కనీసం మూడు అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. కళ్లు మూసుకుని ‘ఓం మణి పద్మేహం, ఓం వజ్రపాణి హూం’ అనే మంత్రాన్ని జపించాలి. కష్టమనిపిస్తే శ్వాస మీద ధ్యాస ఉంచినా సరిపోతుంది. రోజులో కనీసం ఐదు నిమిషాలైనా ప్రశాంతంగా ఈ ముద్రలో కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక అలజడులు ఇట్టే దూరమైపోతాయి. దీంతోపాటు తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే మానసికారోగ్యాన్ని పొందొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్