పరిమళంతో జ్ఞాపకం...!

అమ్మకిస్తే జాగ్రత్తగా దాస్తుందని, పిల్లలు వస్తువులను మనకిస్తారు. తీరా తిరిగి వాళ్లడిగినప్పుడే చిక్కంతా. జాగ్రత్తగా దాచిపెట్టామని మాత్రమే గుర్తుంటుంది, అయితే... ఎంతకూ  జ్ఞాపకం రాదు.

Published : 25 Feb 2024 01:41 IST

అమ్మకిస్తే జాగ్రత్తగా దాస్తుందని, పిల్లలు వస్తువులను మనకిస్తారు. తీరా తిరిగి వాళ్లడిగినప్పుడే చిక్కంతా. జాగ్రత్తగా దాచిపెట్టామని మాత్రమే గుర్తుంటుంది, అయితే... ఎంతకూ  జ్ఞాపకం రాదు. పని ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి ఎదురైనప్పుడు జ్ఞాపకశక్తి దూరమవుతుంది. అలాగే మెనోపాజ్‌ సమయంలోనూ ఇది తగ్గుతుంటుంది. దీన్ని తిరిగి తీసుకురావడంలో పరిమళద్రవ్యాలు సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మెదడులో మరుగున పడే జ్ఞాపకాలను తిరిగి పరిమళద్రవ్యాల వాసనలతో బయటకి తేవొచ్చని పిట్స్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధక బృందం తాజాగా ఓ అధ్యయనంలో తేల్చింది. జ్ఞాపకం తెచ్చుకోవడం కోసం తీవ్రంగా ఆలోచించేటప్పుడు  మెదడు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. అయితే తీవ్ర ఒత్తిడివల్ల మెదడులోని అక్కడి భాగం నియంత్రణకు గురవుతుంది. ఈ సమస్య ఉన్న కొందరికి కాఫీ గింజలు, లవంగమొగ్గలు, నారింజ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వంటివాటితో చేసిన కొన్నిరకాల పరిమళద్రవ్యాల వాసనలను చూపించారు. దాంతో దూరమైన వారి జ్ఞాపకాలు క్రమేపీ తిరిగి రావడం మొదలయ్యాయి. అలాగే పలురకాల సమస్యలవల్ల కుంగుబాటుకు గురయ్యేవారి విషయంలో కూడా... కౌన్సెలింగ్‌కన్నా పరిమళద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.

ఎందుకంటే...

చిన్నచిన్న విషయాలను కూడా ఒత్తిడి మర్చిపోయేలా చేస్తోంది. అందుకే ఉదయం ఇంటిపని మొదలుపెట్టేటప్పుడు లేదా రాత్రి నిద్రపోయే ముందు గదిని సహజసిద్ధమైన పరిమళాలతో నింపితే చాలు. జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చు. మరిగించిన ముప్పావుకప్పు నీటిలో నాలుగు టేబుల్‌స్పూన్ల తులసి ఆకులు వేసి రెండు నిమిషాలు మరగనిచ్చి చల్లార్చాలి. దీన్ని వడకట్టి స్ప్రే సీసాలో నింపాలి. ఇందులో ముప్పావు కప్పు డిస్టిల్డ్‌ వాటర్‌, అయిదు చుక్కల నిమ్మ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇల్లంతా స్ప్రే చేస్తే చాలు. అలాగే చిన్న గిన్నె లేదా మట్టికుండలో గుప్పెడు నారింజపండు ముక్కలు, ఏడెనిమిది లవంగాలు, చిన్నచిన్నగా కట్‌ చేసిన అయిదారు దాల్చినచెక్క ముక్కలను వేయాలి. ఇవి మునిగేలా నీటిని పోసి బాగా మరిగిస్తే చాలు. ఇల్లంతా సువాసనతో నిండుతుంది. కుండీలో విరిసిన గులాబీలు నాలుగింటిని వాజ్‌లో ఉంచి భోజనబల్ల లేదా టీపాయిపై సర్దాలి. గులాబీల పరిమళం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తూనే ఉల్లాసంగానూ ఉంచుతుంది

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్