కోరి తిందామా కాకర!

కాకరకాయ అనగానే అబ్బో చేదు అనేస్తాం. కానీ ఇందులో ఉన్న పోషకాల విలువ తెలిస్తే మాత్రం ఔరా అనడం ఖాయం. మరి అవి మీకందించే ప్రయోజనాలేంటో చూద్దామా  రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచడంలో కాకరకాయ ఔషధంలా పనిచేస్తుంది. అలానే పొటాషియం రక్తపోటు సమస్య రానివ్వదు. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు హృద్రోగాలను దూరం చేస్తాయి.

Published : 26 Feb 2024 02:10 IST

కాకరకాయ అనగానే అబ్బో చేదు అనేస్తాం. కానీ ఇందులో ఉన్న పోషకాల విలువ తెలిస్తే మాత్రం ఔరా అనడం ఖాయం. మరి అవి మీకందించే ప్రయోజనాలేంటో చూద్దామా

క్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచడంలో కాకరకాయ ఔషధంలా పనిచేస్తుంది. అలానే పొటాషియం రక్తపోటు సమస్య రానివ్వదు. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు హృద్రోగాలను దూరం చేస్తాయి. ఇందులోని విటమిన్లు, ఐరన్‌, జింక్‌ వంటివి పోషకాల లేమిని తీరుస్తాయి.

  • ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఏ, సి విటమిన్లు, జింక్‌, బయోటిన్‌ వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మెరిసేలా చేస్తాయి. ముఖంపై వృద్ధాప్య ఛాయలను త్వరగా రానివ్వవు.
  • కాకరకాయలో తక్కువ కెలొరీలు ఉండి, పీచు మెండుగా ఉండటంతో తిన్న వెంటనే కడుపునిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. జీర్ణశక్తి మెరుగుపడి, అధిక బరువు అదుపులోకి వస్తుంది.
  • వ్యాధికారకాలైన వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తినిచ్చే యాంటీ ఆక్సిడెంట్లు కాకరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కారక కణాల పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను రానివ్వవు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్