నైపుణ్యాలకు... వ్యాయామ దన్ను

కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలంటే సాధన చేయాలి. మరి ఆ నేర్చుకున్న విషయాలు గుర్తుండాలంటే ఏం చేయాలో తెలుసా! సాధారణంగా వాద్యకారులు, సర్జన్లు.. వంటి వారికి చేతివేళ్లు చురుగ్గా స్పందించాలి. వారి నియంత్రణలో ఉండాలి. నిజానికి వారికే కాదు, ఏవైనా కొత్త స్కిల్స్‌ నేర్చుకోవాలనుకుంటే, మనలోనూ ఫైన్‌ మోటార్‌ స్కిల్స్‌ మెరుగుపడాలి.

Published : 26 Feb 2024 02:12 IST

కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలంటే సాధన చేయాలి. మరి ఆ నేర్చుకున్న విషయాలు గుర్తుండాలంటే ఏం చేయాలో తెలుసా!

సాధారణంగా వాద్యకారులు, సర్జన్లు.. వంటి వారికి చేతివేళ్లు చురుగ్గా స్పందించాలి. వారి నియంత్రణలో ఉండాలి. నిజానికి వారికే కాదు, ఏవైనా కొత్త స్కిల్స్‌ నేర్చుకోవాలనుకుంటే, మనలోనూ ఫైన్‌ మోటార్‌ స్కిల్స్‌ మెరుగుపడాలి. అందుకు వ్యాయామం చాలా ముఖ్యమట. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడం వల్ల త్వరగా నేర్చుకోవడమే కాదు ఎక్కువకాలమూ అవి గుర్తుంటాయని యూనివర్సిటీ ఆఫ్‌ కొపెన్‌హెగన్‌ చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఏదైనా స్కిల్‌ నేర్చుకునే ముందూ, తర్వాతా వ్యాయామం చేస్తే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చట. ఎక్సర్‌సైజ్‌ చేసిన వారికీ, అసలు చేయని వారికీ, కొద్దిగా చేసిన వారికీ, చేతివేళ్లతో ఆపరేట్‌ చేసే తేలికైన ఓ కంప్యూటర్‌ గేమ్‌ను ఇచ్చి పరీక్షించారట. అందులో వ్యాయామం చేసేవారి సామర్థ్యం 10శాతం పెరిగినట్లు గుర్తించారు. పిల్లలు, పెద్దలూ, వయసు  పైబడిన వారిలోనూ ఇవే ఫలితాలు కనిపించాయట. ముఖ్యంగా రిహాబిలిటేషన్‌ తీసుకుంటున్న వారికి వ్యాయామం బాగా ఉపయోగపడుతుందట. మరి ఇంకేం మీరూ సిద్ధంకండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్