పెద్దమ్మాయికే అలా జరుగుతుందట!

కొంతమంది అమ్మాయిల్లో యుక్తవయసు రాకముందే మొటిమలు, అవాంఛిత రోమాలు, ఆలోచనల్లో పెద్దరికం... లాంటి లక్షణాలను చూస్తుంటాం. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా..!

Updated : 27 Feb 2024 05:35 IST

కొంతమంది అమ్మాయిల్లో యుక్తవయసు రాకముందే మొటిమలు, అవాంఛిత రోమాలు, ఆలోచనల్లో పెద్దరికం... లాంటి లక్షణాలను చూస్తుంటాం. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా..!

ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని మనందరికీ తెలుసు. అయితే రకరకాల కారణాల వల్ల ఒత్తిడి ఎదుర్కొనే వారు అనేకం. ఈ అధిక ఒత్తిడే పుట్టిన ఆడపిల్లల్లో ‘అడ్రినల్‌ ప్యూబర్టీ’కి కారణమవుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా-లాస్‌ ఏంజెలస్‌ చేసిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అయితే ఇందులో మరో ముఖ్య విషయమేంటంటే... ఈ లక్షణాలు మొదట పుట్టిన అమ్మాయిల్లో మాత్రమే కనిపించాయట. తర్వాత పుట్టిన కూతుళ్లలోనూ, అబ్బాయిల్లోనూ ఈ లక్షణాలు లేవట. ఇందుకోసం మొత్తం 253మంది మహిళలను... గర్భధారణ సమయంలోనూ, ప్రసవం తరువాత మరో మూడునెలల పాటూ పరిశీలించారు. వారిలో కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి... ఏ నెలలో ఏ విధంగా ఉన్నాయో నిశితంగా గమనించారు. 15 ఏళ్ల తర్వాత ఆ పిల్లల హార్మోనుల్లో మార్పులను పరిశీలించగా, ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతేకాదు, మన సమాజంలో పిల్లల సంరక్షణ దగ్గర నుంచీ ఇంటి పనుల వరకూ అనేక బాధ్యతలు మొదట పుట్టిన కూతుళ్ల పైనే ఉంటాయి. ‘ఎల్డెస్ట్‌ డాటర్‌ సిండ్రోమ్‌’ గా పిలిచే ఈ అంశానికీ ఈ ఫలితాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే...తల్లులు గర్భధారణ సమయంలో ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాలి. అందుకోసం వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి చేయండి. పనిభారం ఉంటే ఇతరుల సాయం తీసుకోడానికి వెనకాడొద్దు. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్