ముఖ వ్యాయామాలు... చేద్దామా?

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసమని వ్యాయామాలు చేస్తుంటాం. వృద్ధాప్య ఛాయలు మొదట పలకరించేది ముఖాన్నే! వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఫేస్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయాల్సిందే మరి!

Updated : 28 Feb 2024 05:25 IST

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసమని వ్యాయామాలు చేస్తుంటాం. వృద్ధాప్య ఛాయలు మొదట పలకరించేది ముఖాన్నే! వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఫేస్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయాల్సిందే మరి!

  • కాస్త ఒత్తిడి, ఆందోళన ఎదురైనా, తీక్షణంగా చూసినా భృకుటి ముడిపడుతుంది. అది అంతటితో ఆగుతుందా? నుదుటి మీద గీతలకు కారణమవుతుంది. కనుబొమలకు కొద్దిగా పైన వేళ్లతో సున్నితంగా అదిమిపట్టి ఉంచాలి. తర్వాత వీలైనంత పైకి కనుబొమలను ఎత్తి, కొన్ని సెకన్లు అలాగే ఉండాలి. తర్వాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి. ఇలా రోజులో 5-10సార్లు చేస్తే ఆ గీతల తీవ్రత తగ్గుతుంది.
  • కంటి పక్కన సన్నటి గీతలు కనిపిస్తున్నాయా? క్రో ఫీట్‌గా పిలిచే వాటికి చెక్‌ పెట్టాలంటే కన్ను కొట్టాల్సిందే మరి. ఒక కంటిని మూసి, వేలితో మృదువుగా అదిమిపెడితే సరి. మిగతా ముఖమంతా ప్రశాంతంగా ఉంచి, కొన్ని నిమిషాలు అలా ఉంటే సరిపోతుంది. ప్రతి కంటినీ మార్చి మార్చి రోజులో అయిదుసార్లు చొప్పున చేస్తే సరి. ఉబ్బిన కళ్లకీ ఇది మంచి పరిష్కారమే.
  • బుగ్గలు, మెడ దగ్గర చర్మం సాగుతోంటే చీక్‌ స్క్వీజ్‌ చేయాల్సిందే. ఏం లేదు... బుగ్గలకు ఇరువైపులా వచ్చేలా దవడ ప్రాంతాల్లో అరచేతులను ఉంచాలి. తరవాత నెమ్మదిగా అక్కడి చర్మాన్ని మృదువుగా పట్టి లాగి, వదలాలి. ఇలా రోజులో కనీసం 10సార్లు చేయండి. అక్కడి చర్మాన్ని బిగుతుగా చేయడంలో ఈ వ్యాయామం చక్కగా సాయపడుతుంది.
  • రెండు చేతుల చూపుడు, మధ్యవేళ్లను కళ్లకు ఇరువైపులా ఉంచాలి. నెమ్మదిగా వేళ్లను నొక్కిపెట్టి ఉంచి, కళ్లను మూయాలి. కాసేపయ్యాక తెరిచి పైకీ, కిందకీ, పక్కలకీ  తల కదల్చకుండా చూపు తిప్పాలి. ఇలా 5 సెట్లుగా చేస్తే కళ్ల కింద సాగే చర్మానికి చెక్‌ పెట్టొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్