అవి మనమే చెప్పాలి!

యవ్వనంలోకి అడుగు పెట్టాక అమ్మాయికి ఎన్నెన్ని చెబుతాం! నెలసరిలో వీటిని తాకొద్దు, వాటిని వాడొద్దు అంటాం. వారితో మాట్లాడొద్దు, ఇలా నడుచుకోవద్దంటూ ఆంక్షలూ పెడతాం.

Published : 02 Mar 2024 01:38 IST

యవ్వనంలోకి అడుగు పెట్టాక అమ్మాయికి ఎన్నెన్ని చెబుతాం! నెలసరిలో వీటిని తాకొద్దు, వాటిని వాడొద్దు అంటాం. వారితో మాట్లాడొద్దు, ఇలా నడుచుకోవద్దంటూ ఆంక్షలూ పెడతాం. జననాంగాల శుభ్రత సంగతేంటి? వాటి గురించీ మాట్లాడండి.

  • విద్యార్థినులు పబ్లిక్‌ టాయిలెట్లను వాడక తప్పదు. కానీ ఇదేమో బోలెడు ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి, శుభ్రత ప్రాముఖ్యాన్ని వివరంగా చెప్పండి. మనం సిగ్గుపడి వదిలేస్తే ఈ నిర్లక్ష్యం తరవాత ఎన్నో సమస్యలకు దారి తీయొచ్చు. అలాగని సబ్బులు, బాడీవాష్‌లను వాడమనొద్దు. వీటిల్లోని రసాయనాలు అక్కడి చర్మంలోని పీహెచ్‌ స్థాయులపై ప్రభావం చూపుతాయి. దురద, మంటలకు దారితీస్తాయి. కాబట్టి, ఇప్పుడు ఇంటిమేట్‌ వాష్‌లని దొరుకుతున్నాయి. వాటిని తెచ్చివ్వండి. హాని ఉండదు.
  • నెలసరిలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. దీనికితోడు కొన్నిసార్లు ప్యాడ్‌లు ఒరుసుకుపోవడం, అలర్జీలు తోడైతే ఇబ్బంది మరింత పెరుగుతుంది. సంబంధిత ఆయింట్‌మెంట్లను తప్పకుండా దగ్గర ఉంచుకోవాలి. అలాగే జెల్‌ రకాలను కాకుండా కాటన్‌ ప్యాడ్‌లను వాడటం మేలు.
  • ప్యాడ్‌ వెంట తీసుకెళ్లడం, పడేయడం ఇబ్బంది అన్నారనుకోండి. తీసుకెళ్లడానికి వీలుగా పర్సులు, కవర్లు దొరుకుతున్నాయి. వాటిని అమ్మాయిల బ్యాగుల్లో తప్పకుండా ఉండేలా చూసుకోండి.
  • ఇంకా... వెజైనల్‌ డిశ్చార్జ్‌, జననాంగాల్లో దురద, దద్దుర్లు, మూత్రం పోసేప్పుడు మంట లాంటివేమైనా కనిపిస్తే చెప్పమనండి. అవసరమైతే వైద్యుల సాయం తీసుకోండి. అప్పుడే అమ్మాయిని ఆరోగ్యం దిశగా నడిపినట్లు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్