ఇలా చేస్తున్నారా..!

చాలామంది బరువు తగ్గాలని రాత్రిపూట భోజనానికి బదులు ఆయిల్‌ లేని చపాతీలు, రోటీలు తింటుంటారు. అయితే అవి మెత్తగా రావాలని పెనంమీద కాసేపు వేడి చేసి తరవాత నేరుగా స్టవ్‌ మంటపై కాలుస్తుంటారు.

Published : 29 Mar 2024 02:17 IST

చాలామంది బరువు తగ్గాలని రాత్రిపూట భోజనానికి బదులు ఆయిల్‌ లేని చపాతీలు, రోటీలు తింటుంటారు. అయితే అవి మెత్తగా రావాలని పెనంమీద కాసేపు వేడి చేసి తరవాత నేరుగా స్టవ్‌ మంటపై కాలుస్తుంటారు. దీని గురించి తాజా పరిశోధన ఏమంటోందంటే. ఇలా నేరుగా పెద్ద మంటపై కాల్చడంవల్ల రోటీలోని కర్బన పదార్థాలు విచ్ఛిన్నమై కొద్దిస్థాయిలో హానికర అమైన్లూ హైడ్రోకార్బన్లూ ఉత్పత్తవుతాయి. వీటివల్ల శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది అంటున్నాయి తాజా పరిశోధనలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయమై హెచ్చరిక చేస్తోంది. మీరూ ఇలా చేస్తున్నారా...  కాబట్టి జాగ్రత్త..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్