నొప్పులా... ఇవి తగ్గాయేమో!

నిద్ర పోతోంటే కాలు కండరం పట్టేస్తుంది. తర్వాత జాడ కనిపించదు కానీ... ఉన్న కొద్దిసేపూ నొప్పి విపరీతంగా ఉంటుంది. ఏదో పనిచేస్తుంటాం... అకస్మాత్తుగా చెయ్యో, కాలో లాగేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

Published : 30 Mar 2024 01:43 IST

నిద్ర పోతోంటే కాలు కండరం పట్టేస్తుంది. తర్వాత జాడ కనిపించదు కానీ... ఉన్న కొద్దిసేపూ నొప్పి విపరీతంగా ఉంటుంది. ఏదో పనిచేస్తుంటాం... అకస్మాత్తుగా చెయ్యో, కాలో లాగేస్తున్నట్లుగా అనిపిస్తుంది. పోషకాలు తగినంతగా శరీరానికి అందడం లేదనడానికి చిహ్నాలే ఇవి. కాబట్టి...

  • ఎముకల ఆరోగ్యానికి పొటాషియం తప్పనిసరి. ఇది అరటి పండు, చిలగడదుంపల్లో పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.
  • కాయగూరలు తరచుగా తీసుకున్నా, ఆకుకూరల్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తారు కొందరు. దీంతో శరీరానికి తగినంత మెగ్నీషియం అందక ఇలా నొప్పులు పలకరిస్తాయి. వారానికి రెండు మూడుసార్లు ఆకుకూరల్ని తీసుకుంటే మేలు. బాదం, జీడిపప్పు, గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజల్లోనూ మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్‌ సమయంలో 5-10 చొప్పున తీసుకున్నా మేలే.
  • పొటాషియం, తగినంత నీరు అందకపోయినా ఈ నొప్పులు బాధిస్తాయి. నీరు ఎక్కువగా ఉండే నారింజ, పుచ్చకాయ వంటి వాటిని తీసుకుంటే సరి. శరీరాన్ని డీహైడ్రేట్‌ కాకుండా కాపాడటమే కాదు, అలసటనీ తరిమి కొడతాయి. నొప్పుల బాధా ఉండదు.
  • ఎముకలు బలహీనపడినా ఈ సమస్య ఎదురవుతుంది. చేపలను తరచూ తీసుకోండి. వీటిల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. ఇవి ఎముకల్లో ఇన్‌ఫ్లమేషన్‌కి చెక్‌ పెట్టేస్తాయి. పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పండ్ల ముక్కలకు దీన్ని కలుపుకొని తింటే సరి. కాల్షియంతోపాటు శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్‌ కూడా అందుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్