మెల్లకన్నుపై... ఓ కన్నేయండి!

మీకు మెల్లకన్నుందా... అయితే ‘అదృష్టవంతులు’ అనే మాట మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు కదా! ఆ మాట అటుంచితే, ఇది ఉన్న వారికి భవిష్యత్తులో కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Published : 31 Mar 2024 01:34 IST

మీకు మెల్లకన్నుందా... అయితే ‘అదృష్టవంతులు’ అనే మాట మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు కదా! ఆ మాట అటుంచితే, ఇది ఉన్న వారికి భవిష్యత్తులో కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బాల్యంలో మెల్లకన్ను ఉన్నవారు పెరిగాక, హైపర్‌టెన్షన్‌, మెటబాలిక్‌ సిండ్రోమ్‌, ఊబకాయం లాంట¨ వాటితో పాటు హృద్రోగాల బారిన పడే అవకాశం ఉందని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ చేసిన పరిశోధనలు వెల్లడించాయి. 40నుంచి 69ఏళ్ల వయసున్న లక్షమందిని పరీక్షిస్తే, అందులో 3వేలమందికి పైగా బాల్యంలో మెల్లకన్ను ఉన్నట్లు గుర్తించారు. వారిలో 82శాతం మందికి వయసు పెరిగే కొద్దీ కంటిచూపు మందగించిందట. అంతేకాదు, ఈ సమస్య ఉన్న వాళ్లలో డయాబెటిస్‌ వచ్చే అవకాశం 29శాతం ఉండగా, హైపర్‌టెన్షన్‌ 25శాతం, ఊబకాయం 16శాతం ఉన్నట్లు తేల్చారు. ఒక కంట్లో చూపు సరిగా వృద్ధి చెందకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. వైద్య పరిభాషలో దీన్నే ‘లేజీ ఐ’, ‘ఆంబ్లియోపియా’ గా పిలుస్తారు. ఈ స్థితిలో... బలహీనంగా ఉన్న కంటిని, మెదడు గుర్తించకపోవడంతో వాళ్లు దేన్నైనా చూసేటప్పుడు కంటి గుడ్డు దానిస్థానంలో కాకుండా, పక్కకు వెళ్తుంటుంది. ప్రతి వందమంది పిల్లల్లో నలుగురికి ఈ సమస్య ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కళ్లకూ, అవయవ వ్యవస్థకూ మధ్య సంబంధం ఉంటుంది. అందుకే కళ్లను బట్టి మన ఆరోగ్యాన్నీ అంచనా వేయొచ్చంటారు నిపుణులు. కాబట్టి, కళ్ల ముందు కనిపించే ఈ కంటి సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లలకు నాలుగైదేళ్లప్పుడే మెల్లకన్ను ఉందేమో తెలుసుకోవాలి. కళ్ల పరీక్షలు చేయించి, వెంటనే చికిత్స అందించాలి. అప్పుడే ఆరోగ్యకరమైన భవిష్యత్తు వాళ్లకు అందించిన వాళ్లమవుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్