మధ్యరాత్రి మెలకువ వస్తుందా...

కొన్నిసార్లు ఉన్నట్టుండి మధ్యరాత్రి మెలకువ వస్తుంటుంది. మళ్లీ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. దానిఫలితంగా మరుసటి రోజు ఇంటిపనిలో లేదా ఆఫీసులో కునుకు ఆగక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలాకాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు...

Published : 05 Apr 2024 01:55 IST

కొన్నిసార్లు ఉన్నట్టుండి మధ్యరాత్రి మెలకువ వస్తుంటుంది. మళ్లీ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. దానిఫలితంగా మరుసటి రోజు ఇంటిపనిలో లేదా ఆఫీసులో కునుకు ఆగక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలాకాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు...

చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచీ రాత్రి నిద్రపోయే వరకూ ల్యాప్‌టాప్‌లూ, ఫోన్లూ, కంప్యూటర్లు ఎక్కువగా చూస్తుంటారు. వీటి నుంచి విడదలయ్యే కాంతి నిద్రపోవడానికి కావలసిన మెలటోనిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. దాంతో సరిగ్గా నిద్రపట్టదు. అందుకే డిజిటల్‌ పరికరాలకు రాత్రుళ్లు దూరంగా ఉంటే ఈ సమస్య నెమ్మదిగా తగ్గుతుంది.

  • ప్రశాంతమైన నిద్రకి సౌకర్యవంతమైన చోటు తప్పనిసరి. గది చీకటిగా, దోమలు లేకుండా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎటువంటి ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీని వల్ల మధ్యరాత్రి మెలకువ రాకుండా ఉంటుంది.
  • కొందరు నిద్రపోయే ముందు కాఫీ, టీలు తాగుతుంటారు. వీటివల్ల కూడా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంటుంది. వీటిలో ఉండే కెఫీన్‌ ఎక్కువ సేపు మెలకువగా ఉండేలా చేస్తుంది. అందుకే రోజూ వ్యాయామం చేయటం వల్ల యాక్టివ్‌గా ఉండి రాత్రికి ప్రశాంతమైన నిద్రపడుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్