మీ దిండు మంచిదేనా?

దిండు కాస్త మెత్తగా, ఎత్తుగా ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది కదూ! ఊపిరి బాగా ఆడుతుంది, ఫోన్‌, బుక్‌ చేతిలోకి తీసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది అనీ అనుకుంటాం.

Published : 06 Apr 2024 01:54 IST

దిండు కాస్త మెత్తగా, ఎత్తుగా ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది కదూ! ఊపిరి బాగా ఆడుతుంది, ఫోన్‌, బుక్‌ చేతిలోకి తీసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది అనీ అనుకుంటాం. కానీ అది తెచ్చే సమస్యలు బోలెడు...

రోజంతా అలసిపోయాక ఓ మెత్తని దిండు, మేనికి చల్లగా తగిలే గాలి ఉంటే చాలు... ప్రాణం ఎటు పోతోందో కూడా తెలియదు అనిపిస్తుంది. తల కాస్త ఎత్తుగా ఉంటే మెడకి హాయిగా కూడా తోస్తుంది. తాత్కాలిక ఉపశమనం ఏమో కానీ వెన్నుపై ఒత్తిడి పడి, వీపు నొప్పి, నడుము పట్టేయడంతో మొదలై... దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. లేచేసరికి శ్వాసలో ఇబ్బంది అవుతుంది. అంతెందుకు, ఆస్తమా ఉన్నవారికి ఇది మరింత సమస్యగా మారుతుంది. అందుకే తగిన దిండు ఎంచుకోవాలి.

  • మెత్తగా దూదిపింజలా ఉండాలి అంటారు కొందరు... లేదు లేదు గట్టిగా ఉంటేనే మేలని చెబుతారు ఇంకొందరు. రెండూ కాదు ముందు మీరు పడుకునే తీరును గమనించుకోవాలి అంటారు నిపుణులు. వెల్లకిలా పడుకునేవారైతే సన్నగా, మెత్తగా ఉండేవి ఎంచుకోవాలి. ఒకరకంగా తల, మెడ, వెన్ను సమాంతరంగా ఉండాలి. బోర్లా పడుకునే వారైతే మరీ మెత్తగానో మరీ గట్టిగానో ఉండకుండా చూసుకోవాలి. వీళ్లూ దిండు మరీ ఎత్తుగా ఉండకుండా మధ్యస్థంగా ఉండే వాటిని ఎంచుకోవాలి. పక్కకు ఒత్తిగిల్లి పడుకునేవారు మాత్రం కాస్త గట్టిగా ఉన్నవాటికే ఓటేయాలి. ఒకే భంగిమలో పడుకోంగా మరి అంటే... అప్పుడూ మధ్యస్థమైన ఎత్తు, కాస్త మెత్తగా ఉండే వాటికి ప్రాధాన్యమివ్వాలి.
  • అలాగే సహజమైన వాటితో చేసినవాటినే ఎంచుకోండి. ఈకలతో చేసినవి మెత్తగా, హాయిగా అనిపిస్తాయి కానీ... అలర్జీలకూ దారితీస్తాయి. మెమరీ ఫోమ్‌, లేటెక్స్‌, కాటన్‌, పాలిస్టర్‌వి అయితే మేలు. వీటిల్లోనూ మీరు పడుకునే భంగిమకు అనుగుణంగా ఎంచుకోవాలి మరి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్