నెలసరి ముందు ఏమిటిలా?

భావోద్వేగాల్లో మార్పులు, తెలియని ఆందోళన, తలనొప్పి, కడుపుబ్బరం, అలసట... అబ్బబ్బా నెలసరి కొద్దిరోజుల్లో ఉందనగా ఎన్నెన్ని ఇబ్బందులో కదా! నెలసరి ప్రారంభంలోనో, ముగియడంతోనో సమస్య వదిలినా ఉన్నన్ని రోజులూ మామూలు చిరాగ్గా ఉండదు.

Published : 10 Apr 2024 02:15 IST

భావోద్వేగాల్లో మార్పులు, తెలియని ఆందోళన, తలనొప్పి, కడుపుబ్బరం, అలసట... అబ్బబ్బా నెలసరి కొద్దిరోజుల్లో ఉందనగా ఎన్నెన్ని ఇబ్బందులో కదా! నెలసరి ప్రారంభంలోనో, ముగియడంతోనో సమస్య వదిలినా ఉన్నన్ని రోజులూ మామూలు చిరాగ్గా ఉండదు. కానీ కొందరిలో ఈ లక్షణాలు వారం, రెండు వారాల ముందు నుంచే కనిపిస్తాయి. దీన్ని వైద్య పరిభాషలో ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌)గా చెబుతారు. దేశంలో అలాంటివారి సంఖ్య ఏకంగా 43 శాతం పైమాటే అంటున్నాయి అధ్యయనాలు. ఇలాంటప్పుడు...

  • ఉప్పు ఎక్కువ ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. బయట ఆహారపదార్థాలు, ప్రాసెస్‌ చేసినవాటినీ తినకూడదు. వీటిల్లో పెద్ద మొత్తంలో ఉండే సోడియం శరీరంలో నీరు కోల్పోయేలా చేస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం, తిమ్మిరి వంటి సమస్యలు పెరుగుతాయి. అలాగే గ్యాస్‌కు దారితీసే కార్బొనేటెడ్‌, శీతల పానీయాలకూ దూరంగా ఉండాలి.
  • సాధారణంగా ఈ సమయంలో తీపిపై మనసు మళ్లుతుంది. అలాగని తీపి, మసాలా ఆహారాలను తింటే సమస్య పెరుగుతుంది. వీటినీ తినొద్దు.

మరేం చేయాలి..

  • ఉదయ, మధ్యాహ్న భోజనాలను అశ్రద్ధ చేయొద్దు. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పెరుగు, చీజ్‌, అరటి, చిలగడదుంప, బచ్చలికూర, అవకాడో వంటి వాటిని తీసుకుంటే మేలు. ఫైబర్‌, బి విటమిన్లు ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలతోపాటు బ్రౌన్‌రైస్‌, ఓట్‌మీల్‌ వంటివి ఎక్కువగా తింటే అరుగుదల బాగుండటమే కాదు, కడుపుబ్బరం కూడా తగ్గుతుంది.
  • వీలైనంత ఎక్కువ నీటిని తాగాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉదయాన్నే నీరెండలో కాసేపు గడపడంతోపాటు కొద్దిసేపు వ్యాయామం దినచర్యలో తప్పక భాగం చేసుకుంటే ఈ సమస్యల నుంచి తప్పక ఉపశమనం కలుగుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్