వేసవిలో పిల్లలు జాగ్రత్త...

సమ్మర్‌ అంటేనే పిల్లలకు హాలిడే సీజన్‌. ఎక్కువగా ఆరుబయట ఆడుకోవడానికే ఇష్టపడుతుంటారు. ఫలితంగా డీహైడ్రేషన్‌కి గురవుతారు. అలాగని వారిని ఆటలకు దూరం చేయలేం. మరి వారిని ఎండ నుంచి సురక్షితంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు.

Published : 13 Apr 2024 01:52 IST

సమ్మర్‌ అంటేనే పిల్లలకు హాలిడే సీజన్‌. ఎక్కువగా ఆరుబయట ఆడుకోవడానికే ఇష్టపడుతుంటారు.  ఫలితంగా డీహైడ్రేషన్‌కి గురవుతారు. అలాగని వారిని ఆటలకు దూరం చేయలేం. మరి వారిని ఎండ నుంచి సురక్షితంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు..

  • పిల్లలు డీహైడ్రేషన్‌కి గురవ్వడానికి ప్రధాన కారణం వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలే. దీని వల్ల వాళ్లు కొన్ని వ్యాధుల బారిన పడే ప్రమాదమూ ఉంది. కాబట్టి చల్లగా ఉన్న సమయంలో మాత్రమే అంటే ఉదయం 7నుంచి 11.30 వరకూ సాయంత్రం 5 తరవాతే బయట ఆడుకోనివ్వాలి.
  • పిల్లలు ఆటలో పడి నీళ్లు సరిగ్గా తాగరు. అందుకే ప్రతి గంటకి నీళ్లు  తాగమని గుర్తు చేస్తుండాలి. కొందరు మామూలుగానే నీటిని తాగడానికి ఇష్టపడరు. అందుకని వారి కోసం మజ్జిగ, పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు మొదలైన వాటిని అందిస్తుండాలి. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి శక్తినిస్తాయి. మరోపక్క వారి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
  • పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు లేతరంగు వస్త్రాలే ధరించేలా చూడండి. అవైతే ఎండవేడిని తక్కువగా గ్రహిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్