గర్భిణులకు నడక ఆరోగ్యమే

గర్భిణులు వ్యాయామంగా నడక మార్గాన్ని ఎంచుకోవడం మంచిదంటారు నిపుణులు. ఇది శరీరాన్ని సౌకర్యంగా మార్చడమే కాదు, మానసికంగానూ దృఢంగా ఉంచుతుందట. సుఖ ప్రసవానికీ దోహద పడుతుందట. నెలలు నిండే కొద్దీ పెరుగుతున్న పొట్ట కారణంగా పేగు కదలికలు సరిగ్గా ఉండవు.

Published : 15 Apr 2024 02:11 IST

గర్భిణులు వ్యాయామంగా నడక మార్గాన్ని ఎంచుకోవడం మంచిదంటారు నిపుణులు. ఇది శరీరాన్ని సౌకర్యంగా మార్చడమే కాదు, మానసికంగానూ దృఢంగా ఉంచుతుందట. సుఖ ప్రసవానికీ దోహద పడుతుందట.

నెలలు నిండే కొద్దీ పెరుగుతున్న పొట్ట కారణంగా పేగు కదలికలు సరిగ్గా ఉండవు. దీంతో అజీర్తి, మలబద్ధకం వస్తుంది. రోజూ క్రమం తప్పకుండా నడవడం వల్ల వీటిని దూరం చేయొచ్చు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

  • ఈ రోజుల్లో ప్రసవాలు ఎక్కువగా సిజేరియన్లే. కొన్ని సమస్యల వల్ల సాధారణ ప్రసవాలు తగ్గిపోయాయి. నెలలు నిండుతున్న సమయంలో వాకింగ్‌ చేయడం వల్ల నార్మల్‌ డెలివరీకి అవకాశం ఎక్కువట. అంతేకాదు ప్రసవం తరవాత వేగంగా కోలుకోగలుగుతారట.
  • గర్భవతిగా ఉన్నప్పుడు చాలామంది మధుమేహం బారిన పడుతుంటారు. దీన్నే జస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటారు. రోజూ వాకింగ్‌ చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
  • వాకింగ్‌, చిన్నపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది ఈ సమయంలో వచ్చే ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్