కర్రతో చేద్దామా కసరత్తు!

ఆడవాళ్లు ఇంటి పని మొత్తం చేసినా... కసరత్తులు చేయడానికి వెనకాడుతుంటారు. దీనికి మనం సులువుగా చేయలేమేమో అన్న అపోహ ఓ కారణం.  ఈసారి శ్రమ తెలియకుండా  కర్రను ఊతంగా చేసుకోండి.

Published : 16 Apr 2024 01:59 IST

ఆడవాళ్లు ఇంటి పని మొత్తం చేసినా... కసరత్తులు చేయడానికి వెనకాడుతుంటారు. దీనికి మనం సులువుగా చేయలేమేమో అన్న అపోహ ఓ కారణం.  ఈసారి శ్రమ తెలియకుండా  కర్రను ఊతంగా చేసుకోండి.

  • బలంగా ఉన్న ఓ కర్రను తీసుకుని నేలకు ఆనించి నిటారుగా నిలబడండి. ఇప్పుడు చేతులు మార్చుకుంటూ కర్రను పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ చేతులూ, కాళ్లతో పాటు నడుముకీ మంచి వ్యాయామం అవుతుంది. ఏకాగ్రతా పెరుగుతుంది.

  • నిటారుగా నిలబడి కర్రను భుజాలపై ఉంచి రెండు చేతులనూ వాటిపై ఉంచాలి. ఆపై నెమ్మదిగా కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడివైపునకూ తిరగాలి. ఇలా కనీసం పది సార్లయినా చేస్తే సరి. అప్పుడే నడుము వంపుల్లో పేరుకున్న కొవ్వు కరగడంతో పాటు శరీర కదలికలూ తేలిగ్గా సాధ్యపడతాయి.
  • మరోసారి కాళ్లను దూరంగా ఉంచి నిటారుగా నిలబడాలి. ఇప్పుడు భుజాల మీదుగా కర్రను పెట్టి రెండు చేతులనూ వాటి పొడవునా ఉంచాలి. ఇప్పుడు ఎడమ చేతి వైపు ఒకసారి, కుడిచేతి వైపు మరోసారి...ఇలా కనీసం పది నుంచి పదిహేను సార్లు చేస్తే సరి. నడుము, పిరుదులు, చేతికింద వైపు ఉండే కొవ్వు త్వరగా కరుగుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్