ఆహారంలో ఇవి ఉన్నాయా?

ఇంటిల్లిపాదినీ చక్కదిద్దే ఓపిక కావాలన్నా, అందంగా ఆరోగ్యంగా కనిపించాలన్నా... శరీరానికి సరిపడా పోషకాలన్నీ అందాల్సిందే. మరి అవేంటి? వేటి నుంచి అందుతాయి అంటారా? అయితే, ఇది మీకోసమే.

Published : 20 Apr 2024 02:06 IST

ఇంటిల్లిపాదినీ చక్కదిద్దే ఓపిక కావాలన్నా, అందంగా ఆరోగ్యంగా కనిపించాలన్నా... శరీరానికి సరిపడా పోషకాలన్నీ అందాల్సిందే. మరి అవేంటి? వేటి నుంచి అందుతాయి అంటారా? అయితే, ఇది మీకోసమే.

ప్రొటీన్లు: శరీరంలో కొత్త కణాల వృద్ధికి దోహదం చేస్తాయి. గుడ్లు, కందిపప్పు, మాంసం, నట్స్‌, చేపలూ, పాల పదార్థాల నుంచి ప్రొటీన్లు బాగా అందుతాయి. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా, కండరాలు బలోపేతం అవ్వాలన్నా కూడా ఇవి కీలకమే మరి.

కొవ్వులు: చాలామంది కొవ్వులు అనగానే శరీరానికి చెడు చేస్తాయనీ, బరువు పెరుగుతామనీ అపోహ పడుతుంటారు. అయితే, ఇవి శరీరానికి ఇంధనంలా ఉపయోగపడతాయి. జీవక్రియలకు ఊతమిచ్చే హార్మోన్ల ఉత్పత్తిని ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రేరేపిస్తాయి. అంతేకాదు కణ నిర్మాణానికీ, విటమిన్‌ ఎ, డి, ఇ, కెల శోషణకూ ఇవి కీలకం. అందుకే రోజూ ఇవి కూడా తగిన మోతాదులో అందాల్సిందేనట.

ఇనుము: ఇది శరీరంలో అన్ని అవయవాలకూ ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా అందించడానికీ దోహదం చేస్తుంది.  ఇది లోపించడం వల్ల ఆక్సిజన్‌ సరఫరా సరిగా ఉండదు, రక్తహీనత కూడా బాధించే ప్రమాదం ఉంటుంది. అందుకే పాలకూర, ఎర్రకందిపప్పు, ఓట్స్‌, చేపలూ, పౌల్ట్రీ పదార్థాలూ, బీన్స్‌ నుంచి ఇనుమును అత్యధికంగా పొందొచ్చు.

విటమిన్‌ సి: ఇది రోగనిరోధకశక్తిని పెంచి పలు అనారోగ్యాలను దూరం చేస్తుంది. అందుకే నిత్యం నిమ్మజాతి పండ్లూ, వివిధ రకాల ఆకుకూరలు తినడానికి ప్రాధాన్యమివ్వాలి.

విటమిన్‌ డి: ఇది లోపించినప్పుడు ఎముకలు బలహీనపడిపోతాయి. మహిళలూ, ఎదిగే చిన్నారుల ఎముకలు ఎంతో దృఢంగా ఉండాలి. లేదంటే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విటమిన్‌ డి ప్రతిరోజూ అందడం వల్ల అవి బలపడతాయి. సూర్మరశ్మి, పాలూ, గుడ్లూ, చేపల నుంచి విటమిన్‌ డి బాగా అందుతుంది.

విటమిన్‌ బి:  బి విటమిన్‌ లోపించడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, రైబోఫ్లెవిన్‌, బయోటిన్‌, విటమిన్‌ బి12, బి6, బి5 తప్పనిసరిగా అందాలి. అవన్నీ శరీరానికి సరిపడా అందాలంటే.. విటమిన్‌ బి లభించే గుడ్లు, పాలు, లివర్‌, బీన్స్‌, మాంసాహారం, పౌల్ట్రీ పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్