నొప్పులు తగ్గించే నిమ్మగడ్డి...

నిమ్మగడ్డి సువాసననిచ్చే ఔషధ మొక్కే కాదు... వంటకాలకు రుచినీ, ఒంటికి పోషకాలనూ ఇచ్చే శక్తి వనరు. మరి దీనివల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందామా! లెమన్‌ గ్రాస్‌లో కార్బోహైడ్రేట్స్‌, కెలొరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తప్పక ఎంచుకోవచ్చు. ఇక, ఇందులోని సిట్రాల్‌ కాంపౌండ్‌ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను శుభ్రపరుస్తుంది. గ్యాస్‌నీ దరిచేరనీయదు.

Published : 22 Apr 2024 01:53 IST

నిమ్మగడ్డి సువాసననిచ్చే ఔషధ మొక్కే కాదు... వంటకాలకు రుచినీ, ఒంటికి పోషకాలనూ ఇచ్చే శక్తి వనరు. మరి దీనివల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందామా!

లెమన్‌ గ్రాస్‌లో కార్బోహైడ్రేట్స్‌, కెలొరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తప్పక ఎంచుకోవచ్చు. ఇక, ఇందులోని సిట్రాల్‌ కాంపౌండ్‌ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను శుభ్రపరుస్తుంది. గ్యాస్‌నీ దరిచేరనీయదు. అలానే, విటమిన్‌ ఎ, సిలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వాపుల్నీ తగ్గిస్తాయి.  

  • నిమ్మగడ్డితో చేసే టీ నెలసరి ముందు కనిపించే వికారం, ఒళ్లునొప్పులు వంటివన్నీ అదుపులో ఉంచుతుంది. హార్మోన్లూ సమతులమవుతాయి. శారీరకంగానే కాదు మానసికంగానూ సాంత్వన లభిస్తుంది.
  • నిమ్మగడ్డిలో యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కడుపులో నులిపురుగుల్నీ తగ్గిస్తాయి. జలుబూ, తలనొప్పి వంటివీ త్వరగా తగ్గుతాయి. అంతేకాదు, ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్త సరఫరాలో హెచ్చుతగ్గులు సమన్వయమవుతాయి. ఫలితంగా రక్తపోటూ నియంత్రణలో ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్