కొవ్వు కరిగించే వ్యాఘ్రాసనం

ప్రసవానంతరం శరీరంలో వచ్చే మార్పులు లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తున్నాయి. దీనివల్ల పొత్తికడుపు, తొడ భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. తగ్గించడానికి ఒకసారి వ్యాఘ్రాసనం ప్రయత్నించి చూడండి. శరీరంలో అదనపు కొవ్వును కరిగించడమే కాకుండా తుంటి, వెన్ను భాగాల్ని దృఢంగా మారుస్తుంది.

Updated : 04 May 2024 05:05 IST

ప్రసవానంతరం శరీరంలో వచ్చే మార్పులు లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తున్నాయి. దీనివల్ల పొత్తికడుపు, తొడ భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. తగ్గించడానికి ఒకసారి వ్యాఘ్రాసనం ప్రయత్నించి చూడండి. శరీరంలో అదనపు కొవ్వును కరిగించడమే కాకుండా తుంటి, వెన్ను భాగాల్ని దృఢంగా మారుస్తుంది.

వ్యాఘ్రాసనం వేయడానికి ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా మోకాళ్ల మీద పైకి లేచి ఫొటోలో చూపిన విధంగా ముందుకు వంగి రెండు అరచేతులను భుజాలకి సమాంతరంగా నేలపై ఆనించాలి. రెండు మోకాళ్ల మధ్య తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. శరీర బరువును ఎడమ మోకాలిపై వేస్తూ కుడికాలిని చాపి నెమ్మదిగా లోపలికి మడవాలి. ఫొటోలో చూపిన మాదిరిగా తలను కిందకి వంచి మోకాలు నుదిటిని తాకేలా చూసుకోవాలి. దీన్నే మరో విధంగానూ ప్రయత్నించవచ్చు.. కుడికాలిని వెనకకు చాపి ఫొటోలో చూపినట్లు వీలైనంత పైకి మడవాలి. ఈ క్రమంలో తలను నెమ్మదిగా వీలైనంత పైకెత్తి చూడాలి. ఈ భంగిమలో 20 సెకన్ల పాటు ఉండి, మధ్యలో కాస్త విరామం ఇచ్చి తిరిగి మరోవైపు ప్రయత్నించాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి శవాసనంలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. మోకాళ్లు, వెన్నెముక సర్జరీలు అయినవారు ఈ ఆసనానికి దూరంగా ఉంటే మంచిది.

ఉపయోగాలు..

ఈ ఆసనం వేయడం వల్ల భుజం, తుంటి కండరాలకు బలం చేకూరుతుంది. అంతేకాదు తొడ, తుంటి భాగాల్లో ఎక్కువున్న కొవ్వు కరుగుతుంది. అజీర్తిని తగ్గించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. సయాటికా ఉన్నవారికి ఈ ఆసనం ఉపశమనం కలిగిస్తుంది. స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది.

శిరీష, యోగ గురు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్