నురగ స్నానం మంచిదేనా?

వేసవి ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు షవర్‌బాత్‌లూ టబ్‌బాత్‌లూ చేస్తుంటారు కొందరు. వీటివల్ల మహిళలకు యూటీఐ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నాయి అధ్యయనాలు. నురగ ఎక్కువ రావడానికి ఉపయోగించే రసాయనాలు జననేంద్రియాల్లో మంట, దురదను కలిగిస్తాయి.

Published : 04 May 2024 01:57 IST

మీకు తెలుసా?

వేసవి ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు షవర్‌బాత్‌లూ టబ్‌బాత్‌లూ చేస్తుంటారు కొందరు. వీటివల్ల మహిళలకు యూటీఐ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నాయి అధ్యయనాలు. నురగ ఎక్కువ రావడానికి ఉపయోగించే రసాయనాలు జననేంద్రియాల్లో మంట, దురదను కలిగిస్తాయి. సహజంగా యోని పీహెచ్‌ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకర బ్యాక్టీరియాను కాపాడటంలో సాయపడుతుంది. బబుల్‌బాత్‌ లిక్విడ్‌లో ఉండే హానికారక రసాయనాలు... జననేంద్రియాల్లో ఉండే సహజ నూనెలను తొలగించడంతో ఆ ప్రదేశం పొడిగా మారే అవకాశం ఉంది. అలా కాకూడదంటే... మీ చర్మతత్త్వాన్ని బట్టి సల్ఫేట్లు లేని బాత్‌సోప్‌ లిక్విడ్లు మాత్రమే ఎంచుకోవాలి. పావుగంటకు మించకుండా స్నానం చేసేయాలి. స్నానానంతరం జననేంద్రియాలను తడి లేకుండా తుడవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్