అన్నీ తినాలి మరి!

బరువు పెరుగుతున్నామనుకుని తిండిమానేయడం, అసలు అరోగ్యాన్ని పట్టించుకోకుండా కనిపించిందల్లా తినడం రెండూ పొరపాటే. అమ్మాయిలు సాధారణంగా పని ఒత్తిడితో చేసే పనులే ఇవి. నిజానికి సన్నబడాలంటే సమతులాహారం తీసుకోవాలి.

Published : 06 May 2024 02:08 IST

బరువు పెరుగుతున్నామనుకుని తిండిమానేయడం, అసలు అరోగ్యాన్ని పట్టించుకోకుండా కనిపించిందల్లా తినడం రెండూ పొరపాటే. అమ్మాయిలు సాధారణంగా పని ఒత్తిడితో చేసే పనులే ఇవి. నిజానికి సన్నబడాలంటే సమతులాహారం తీసుకోవాలి. అదెలాగంటారా?

సన్నబడాలనుకున్నప్పుడు అసలు కొవ్వుల అవసరమే ఉండదనుకోవడం, అవి లేని పదార్థాలను మాత్రమే తీసుకోవడం పొరబాటు. శరీర వ్యవస్థలు, హార్మోన్ల పనితీరు సరిగ్గా సాగిపోవాలంటే డైటరీ ఫ్యాట్‌ల అవసరం ఎక్కువే. లేదంటే నెలసరి ఇబ్బందులు తప్పకపోవచ్చు. పైగా ఆకలి అదుపు చేసుకోలేకపోవచ్చు. మేలైన కొవ్వులు అందేలా గుడ్లు, పప్పుధాన్యాలు, అవిసెగింజలు, చేపలు వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

  • మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారతాయి. ఇవి చక్కెరల్లా పనిచేయడం వల్ల బరువూ పెరుగుతారు. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సంక్లిష్ట పిండి పదార్థాలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి. బదులుగా సాధారణ బియ్యాన్ని తగ్గిస్తూనే, బ్రౌన్‌రైస్‌ని  ఎంచుకోవాలి. రాగులు, కొర్రలు, జొన్నలు వంటి చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాటివల్ల తగినంత పీచూ అంది జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
  • ఆకుకూరలు, కాయగూరలను సమ ప్రాధాన్యంతో ఎప్పుడో ఒకసారి కాకుండా తీసుకునే ప్రతి భోజనంలో భాగం చేసుకోవాలి. కాయగూరల్లో ఉండే విటమిన్లు శరీరానికి మేలు చేయడమే కాదు, పీచునూ అందిస్తాయి. పొట్ట నిండేలా చేసి, ఆకలినీ తగ్గిస్తాయి. అందుకే కీరదోస, క్యారెట్‌, టొమాటో, ఉల్లిపాయ, బీట్‌రూట్‌, క్యాబేజీలతో పాటు ఆకుపచ్చని ఆకుకూరలు పాలకూర, మెంతి కూర, తోటకూర, కరివేపాకు వంటి వాటికి తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్