వేడికి... సహజ మంత్రం!

పెరుగుతున్న వేడి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది కదూ! దీనికి ఉక్కబోతకి చర్మం జిడ్డెక్కడం, దద్దుర్లు, దురద సహా ఇంకెన్ని సమస్యలో! పోగొట్టుకోవడానికి మార్కెట్‌లో బోలెడు ఉత్పత్తులు. కానీ ఖర్చేమో ఎక్కువ. దాన్ని తగ్గిస్తూ సహజ మార్గాలను ప్రయత్నిద్దామా? నిపుణులూ వాటికే ఓటేయమంటున్నారు.

Published : 08 May 2024 02:38 IST

పెరుగుతున్న వేడి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది కదూ! దీనికి ఉక్కబోతకి చర్మం జిడ్డెక్కడం, దద్దుర్లు, దురద సహా ఇంకెన్ని సమస్యలో! పోగొట్టుకోవడానికి మార్కెట్‌లో బోలెడు ఉత్పత్తులు. కానీ ఖర్చేమో ఎక్కువ. దాన్ని తగ్గిస్తూ సహజ మార్గాలను ప్రయత్నిద్దామా? నిపుణులూ వాటికే ఓటేయమంటున్నారు. అవేంటంటే...

  • పనిమీద అలా బయటికి వెళ్లొచ్చామంటే చాలు. ముఖం ఎర్రగా కమిలిపోతుంది. కొందరిలో కాసేపటికి తగ్గుతుంది. కానీ చాలామందిలో దద్దుర్లు, చర్మమంతా నల్లగా మారడం లాంటివి కనిపిస్తాయి. తప్పించుకోవాలంటే ఇంటికి రాగానే ముఖాన్ని శుభ్రం చేసుకొన్నాక కలబంద గుజ్జును రాసి చూడండి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేస్తాయి. గ్రీన్‌ టీని చల్లార్చి దూదితో రాసి, ఆరాక కడిగినా మంచిదే.
  • ఇంట్లో ఉన్నా ఉక్కబోత తక్కువా? అదేమో చెమటకాయలు, దురదలకు దారితీస్తుంది. సాధారణంగా పౌడర్‌ చల్లుతుంటాం కదా? బదులుగా ఓట్‌మీల్‌ని ప్రయత్నించండి. దీన్ని మెత్తగా పౌడర్‌లా చేసుకుని, బకెట్‌ గోరువెచ్చని నీటిలో రెండు పెద్ద చెంచాలు కలపాలి. పావుగంట అలా వదిలేసి, ఆ నీటితో స్నానం చేయండి. ఇలా తరచూ చేస్తే సరి. చర్మానికీ పోషణ అందుతుంది, సమస్యా అదుపులోకి వస్తుంది.
  • చెమటకి జిడ్డుగా అనిపిస్తుందని మాయిశ్చరైజర్‌ని రాయడానికి సందేహించేవారే ఎక్కువ. దీంతో చర్మం నిర్జీవంగా, కళావిహీనంగా తయారవుతుంది. రాత్రుళ్లు స్నానం చేశాకగానీ, ఉదయం స్నానానికి ముందుగానీ కొబ్బరి నూనెను ఒళ్లంతా పట్టించండి. నలుగుకు ముందులా కాకుండా రెండు మూడు చుక్కలు వేసుకుంటూ మృదువుగా రాసుకుంటూ వెళితే చాలు. దీనిలో సమృద్ధిగా ఉండే ఫ్యాటీయాసిడ్లు కావాల్సిన తేమను అందిస్తూనే చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండేలానూ చూస్తాయి. అదీ జిడ్డే అనిపిస్తే పుచ్చకాయ రసాన్ని రాసుకొని, ఆరాక కడిగినా చాలు. చిన్నవే కానీ... చర్మసంరక్షణలో చూపే ప్రయోజనమెంతో. ఈ చిట్కాలతో వేసవి నుంచి చర్మాన్ని కాపాడుకుందామా మరి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్