పోషకాల అవిసెలు..!

చాక్లెట్లు నుంచి ఓట్‌మీల్‌ వరకు అన్ని రకాల ఆహరపదార్థాల్లో అవిసెలు కనిపిస్తున్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లూ, లిగ్నన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే వీటిని, మహిళలు రోజూ ఆహారంలో చేర్చుకోవడంవల్ల, హృదయ సంబంధిత, రుతుక్రమ, క్యాన్సర్‌లకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తాయని టొరంటో విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది.

Published : 19 May 2024 01:34 IST

చాక్లెట్లు నుంచి ఓట్‌మీల్‌ వరకు అన్ని రకాల ఆహరపదార్థాల్లో అవిసెలు కనిపిస్తున్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లూ, లిగ్నన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే వీటిని, మహిళలు రోజూ ఆహారంలో చేర్చుకోవడంవల్ల, హృదయ సంబంధిత, రుతుక్రమ, క్యాన్సర్‌లకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తాయని టొరంటో విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది.

  • అవిసెలు మహిళల్లో వచ్చే రొమ్ముక్యాన్సర్,  పెద్దపేగు క్యాన్సర్లు రాకుండా నివారిస్తాయని కెనడా నూట్రిషన్‌ కౌన్సిల్‌ పేర్కొంది. వీటిల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు క్యాన్సర్‌ కణతుల్ని పెరగకుండా నియంత్రిస్తాయి. యుక్తవయసు వారిలో క్యాన్సర్‌ వచ్చిన వారుంటే రోజూ ఆహారంలో అవిసెలను తీసుకోవడంవల్ల వీటిలో ఉండే లిగ్నన్లు క్యాన్సర్‌ కణాలతో పోరాడి, వృద్ధి చెందకుండా కాపాడతాయి.
  • రుతుక్రమం ఆగిన మహిళలల్లోనే హృద్రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయని తెలిసింది. ఇందుకోసం కొంతమంది మహిళలకు సంవత్సరకాలం పాటు రోజూ నాలుగు చెంచాల అవిసె గింజలు ఇచ్చారు. వీటిలోఉండే లిగ్నన్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించడమే కాకుండా, రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా కాపాడాయి. అంతేకాదు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయని తేలింది. టైప్‌-2 డయాబెటిస్‌ మెరుగుపడింది.
  • ప్రసవానంతరం లేదా నెలసరి ఆగిన మహిళల్లో అరికాళ్లూ, చేతులూ మంట పెడుతుంటాయి. పరిశోధనలో భాగంగా కొంతమంది మహిళలకు రోజూ రెండు చెంచాల అవిసెలు, తృణధాన్యాలను పెరుగు, సలాడ్లు, జ్యూస్‌ల్లో కలిపి ఇచ్చారట. వారం రోజుల్లోనే 57శాతానికి అరికాళ్ల మంటలు తగ్గినట్లు వారు గమనించారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్