అతిగా తింటున్నారా..!

తిండి మనిషిని బతికిస్తుంది.. కానీ ఏది పడితే అది తింటే అదే చిన్న చిన్నగా మన ప్రాణాల్ని తీనేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరి ఆ ఆహారం ఏంటి? అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందామా..

Published : 20 May 2024 01:38 IST

తిండి మనిషిని బతికిస్తుంది.. కానీ ఏది పడితే అది తింటే అదే చిన్న చిన్నగా మన ప్రాణాల్ని తీనేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరి ఆ ఆహారం ఏంటి? అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందామా..

ఆరోగ్యంగా ఉండటానికి రోజూ సమతులాహారం తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. కానీ ఈ మధ్యకాలంలో అందరూ రుచుల పేరుతో అల్ట్రా ప్రాసెస్డ్‌  ఫుడ్స్‌నే ఎక్కువ ఇష్టపడుతున్నారు. వీటిని తినడం వల్ల అనేక దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తున్నాయని ఇటీవల బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ 30 ఏళ్లపాటు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అయితే వీటిని ఎక్కువ రోజులు నిలవ చేయడానికీ, రుచిని పెంచడానికీ ఉపయోగించే మసాలాలు, కృత్రిమ రంగులు, ఫ్రక్టోజ్‌ సిరప్‌లు, టేస్టింగ్‌సాల్ట్, హైడ్రోజినేటెడ్‌ ఫ్యాట్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు, ఈ ఆహార పదార్థాల్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, పీచుపదార్థాలు లేకపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఓ అధ్యయనం ప్రకారం వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ తిన్నవారిలో టైప్‌- 2 డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయం మరింత పెరిగే అవకాశం ఉంది. గుండె పోటు వచ్చే అవకాశం 28శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే చాక్లెట్లు, ఐస్‌క్రీమ్, బేకరీ ఐటమ్స్‌ వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి. వీటితోపాటు ఫ్రోజెన్‌ చికెన్, మటన్, సీఫుడ్‌కి దూరంగా ఉండాలి. కూల్‌డ్రింక్స్‌ని పూర్తిగా మానేస్తే మంచిది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్